ఆ జాబితాలో చేరిన ఎమ్మెస్ ధోనీ... ఐపీఎల్ 2022 సీజన్‌లో వింటేజ్ మాహీ మ్యాజిక్...
ఐపీఎల్ 2022 సీజన్‌ని డిఫరెంట్ ఎనర్జీతో మొదలెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ. టోర్నీ ఆరంభానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు నిర్ణయం ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యపరిచిన మాహీ... 2022 సీజన్‌లో వింటేజ్ ధోనీని చూడబోతున్నారంటూ సిగ్నల్స్ ఇచ్చేశాడు...

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి... రెండేళ్ల గ్యాప్ తర్వాత అర్ధశతకం నమోదు చేసిన మాహీ, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతినే పెవిలియన్ బయటికి తరలించాడు...
క్రీజులోకి వస్తూనే ఓ సిక్సర్, ఓ ఫోర్ కొట్టిన ఎమ్మెస్ ధోనీ 6 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మాహీ, టీ20ల్లో 7వ వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు...
ఓవరాల్‌గా టీమిండియా తరుపున ఈ ఫీట్ సాధించిన ఆరో భారత క్రికెటర్‌గా నిలిచాడు ఎమ్మెస్ ధోనీ. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనా, రాబిన్ ఊతప్ప ఈ ఫీట్ సాధించారు...
టీ20ల్లో 10326 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ 9936 పరుగులు చేయగా శిఖర్ ధావన్ 8818 పరుగులు చేశాడు...
సురేష్ రైనా టీ20ల్లో 8654 పరుగులు చేయగా, రాబిన్ ఊతప్ప 7070 టీ20 పరుగులతో ఎమ్మెస్ ధోనీ కంటే ముందున్నాడు. ఐపీఎల్‌లో 4800 పరుగులు పూర్తి చేసుకున్న ఊతప్ప, మాహీని దాటేశాడు...
ఎమ్మెస్ ధోనీ కంటే ముందు టీ20ల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్నవారంతా టాపార్డర్ బ్యాటర్లు కాగా మాహీ ఒక్కడే లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్...
ఐపీఎల్ 2021 టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ ఎదుర్కొన్న ఆఖరి 19 బంతుల్లో 51 పరుగులు రావడం విశేషం. ఇందులో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైయిక్ రేటు 268కి పైగా ఉంది...
Dhoni CSK
ఐపీఎల్‌లో డెత్ ఓవర్లలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గానూ టాప్‌లో ఉన్నాడు ఎమ్మెస్ ధోనీ.ఏబీ డివిల్లియర్స్ 81 ఇన్నింగ్స్‌లో 140 సిక్సర్లు, కిరన్ పోలార్డ్ 120 ఇన్నింగ్స్‌ల్లో 137 సిక్సర్లు బాదితే... ఎమ్మెస్ ధోనీ 153 ఇన్నింగ్స్‌ల్లో 166 సిక్సర్లు బాదాడు...