- Home
- Sports
- Cricket
- ఆ ముగ్గురినీ బాగా మిస్ అవుతున్న చెన్నై సూపర్ కింగ్స్... దీపక్ చాహార్ రాక ఆలస్యమైతే...
ఆ ముగ్గురినీ బాగా మిస్ అవుతున్న చెన్నై సూపర్ కింగ్స్... దీపక్ చాహార్ రాక ఆలస్యమైతే...
ఐపీఎల్ 2022 సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్‌గా ప్రారంభించింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే టోర్నీ ఆరంభానికి రెండు రోజుల ముందు ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం, ఆ టీమ్‌పై భారీగానే ప్రభావం చూపినట్టు తెలుస్తోంది...

ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా మొదటి రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది చెన్నై సూపర్ కింగ్స్. కెప్టెన్‌గా రవీంద్ర జడేజా, ఒక్క విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు...
కెప్టెన్ రవీంద్ర జడేజా అయినా ఫీల్డ్ సెట్టింగ్ దగ్గర్నుంచి బౌలింగ్ మార్పుల దాకా అన్నీ ఎమ్మెస్ ధోనీయే చూసుకుంటున్నాడు. జడ్డూ కేవలం ఆన్ పేపర్ కెప్టెన్‌గానే మారాడు...
అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో ముగ్గురు ప్లేయర్లను బాగా మిస్ అవుతోంది చెన్నై సూపర్ కింగ్స్. బౌలర్లు దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్‌లతో పాటు ఓపెనర్ ఫాఫ్ డుప్లిసిస్...
సీనియర్ ఓపెనర్ ఫాఫ్ డుప్లిసిస్, యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కలిసి గత సీజన్‌లో 700+ పైగా పరుగులు చేసి... సీఎస్‌కే విజయంలో కీ రోల్ పోషించారు...
ఒకే సీజన్‌లో ఒకే టీమ్‌కి చెందిన ఇద్దరు ఓపెనర్లు 600+ పరుగులు చేసి ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఫాఫ్ డుప్లిసిస్‌ని వేలంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు సీఎస్‌కే...
ఫాఫ్ డుప్లిసిస్ గైర్హజరీ నుంచి రుతురాజ్ గైక్వాడ్ ఇంకా బయటికి రానట్టు తెలుస్తోంది. మొదటి రెండు మ్యాచుల్లో 7 బంతులాడిన రుతురాజ్, కేవలం 1 పరుగు చేసి, తీవ్రంగా నిరాశపరిచాడు...
ఐపీఎల్ 2021 సీజన్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో 24 వికెట్లు తీసి, సీఎస్‌కే తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. అయితే శార్దూల్ ఠాకూర్‌ని కూడా తిరిగి కొనుగోలు చేయలేకపోయింది సీఎస్‌కే...
వేలంలో రూ.14 కోట్లు పోసి కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ దీపక్ చాహార్, గాయం కారణంగా జట్టుకి అందుబాటులో లేకపోవడం... సీఎస్‌కేపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది...
పవర్ ప్లేలో కనీసం 1-2 వికెట్లు తీయడం దీపక్ చాహార్ ప్రత్యేకత. సీఎస్‌కే ఇప్పుడు మిస్ అవుతోంది అదే. 211 పరుగుల లక్ష్యఛేదనలో కెఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్ కలిసి 99 పరుగులు జోడించారు. దీంతో భారీ టార్గెట్ కాస్తా ఈజీ టార్గెట్‌గా మారిపోయింది...
భారీ ఆశలు పెట్టుకున్న ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్ వంటి ప్లేయర్లు కూడా గాయపడడంతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది...
దీపక్ చాహార్ సెకండాఫ్ సమయానికి అందుబాటులో ఉంటాడని సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ తెలిపాడు. ఆ సమయానికి సీఎస్‌కే సరిపడా విజయాలు అందుకోలేకపోతే ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయని ఆందోళన చెందుతున్నారు చెన్నై ఫ్యాన్స్...