- Home
- Sports
- Cricket
- IPL: ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్.. ఇంకా కోలుకోని స్టార్ బ్యాటర్.. ఢిల్లీ తో మ్యాచ్ నుంచి ఔట్..
IPL: ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్.. ఇంకా కోలుకోని స్టార్ బ్యాటర్.. ఢిల్లీ తో మ్యాచ్ నుంచి ఔట్..
IPL 2022 - Mumbai Indians: ఐపీఎల్ లో ఐదు సార్లు విజేత ముంబై ఇండియన్స్ కు సరిగ్గా సీజన్ పది రోజులకు ముందు ఊహించని షాక్ తగిలింది. గతేడాది ప్లేఆఫ్స్ కూడా దాటకపోయిన ఆ జట్టు.. ఈసారి ట్రోఫీ మీద కన్నేసిన నేపథ్యంలో..

ఈనెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నది. కాగా ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచును ఆ మరుసటి రోజు ఆడనున్నది. అయితే ఈ మ్యాచుకు ముందే ముంబైకి భారీ షాక్ తగిలింది.
ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచుకు అందుబాటులో ఉండటం లేదు. వెస్టిండీస్ తో ఫిబ్రవరి లో ముగిసిన వన్డే, టీ20 సిరీస్ లో రాణించిన సూర్య.. ఆ సిరీస్ లో గాయమై లంకతో టీ20లకు తప్పుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో ఉన్నాడు. అయితే సూర్యకు అయిన గాయం ఇంకా పూర్తిగా మానలేదని, అది తగ్గేదాకా అతడు మ్యాచులకు దూరంగా ఉండటమే మంచిదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తో మార్చి 27న జరిగే తొలి (ముంబైకి) మ్యాచుకు అతడు అందుబాటులో ఉండడని.. అయితే ఆ తర్వాత మ్యాచులకు మాత్రం సూర్య ముంబై తరఫున ఆడతాడని తెలిపాడు.
ఢిల్లీ తో మ్యాచ్ ముగిశాక (మార్చి 27న) తిరిగి ముంబై మరో మ్యాచ్ ఆడటానికి 5 రోజుల సమయం ఉంది. దీంతో అప్పటివరకు సూర్య పూర్తిగా కోలుకుంటాడని, అప్పుడు అతడు ఆడటానికి అవకాశమున్నదని బీసీసీఐ అధికారి వివరించారు.
గతేడాది ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా.. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కీరన్ పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లను కూడా రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై జట్టులో అతడు కీలక బ్యాటర్.
360 డిగ్రీస్ ప్లేయర్ గా గుర్తింపు పొందిన యాదవ్ లేేకుండా తొలి మ్యాచ్ ఆడుతుండటం ముంబైకి లోటే. అయితే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్లు కూడా ఉండటం ముంబైకి కలిసొచ్చే అంశం.
ఇదిలాఉండగా లంకతో రెండో టెస్టు ముగిసిన వెంటనే భారత జట్టు సారథి రోహిత్ శర్మతో పాటు ముుంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేరుగా ముంబై ఇండియన్స్ బస చేసిన హోటల్ కు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ముంబై తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంది.