MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మూలిగే నక్కపై తాటికాయ... ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్‌కి మరో షాక్...

మూలిగే నక్కపై తాటికాయ... ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్‌కి మరో షాక్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫైవ్ టైమ్ టైటిల్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కి ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటికే వరుసగా 8 మ్యాచుల్లో ఓడి, చెత్త రికార్డు మూటకట్టుకుని... ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచింది ముంబై ఇండియన్స్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 09 2022, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రోహిత్ శర్మ పరుగులు చేయలేకపోవడం, జస్ప్రిత్ బుమ్రా వికెట్లు తీయలేకపోతుండడం... వచ్చే సీజన్‌కి అందుబాటులో ఉండే ఆర్చర్ లాంటి ప్లేయర్ కోసం ఎక్కువగా ఖర్చు చేసి, ఈ సీజన్‌ని పెద్దగా పట్టించుకోకపోవడం ముంబై ఇండియన్స్‌పై భారీగానే ప్రభావం చూపింది...

28

వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి ఫామ్‌లోకి వచ్చిన ముంబై ఇండియన్స్‌... సీజన్‌ని ఆఖరి పొజిషన్‌లో ముగించకుండా ఉండేందుకు మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది...

38

ఐపీఎల్ 2009 సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, ఈ సారి మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచినా ఆ పొజిషన్‌ను అందుకోవడం కూడా కష్టమే. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా కేకేఆర్‌తో మ్యాచ్‌కి ముందు ముంబైకి మరో షాక్ తగిలింది...

48
Suryakumar Yadav

Suryakumar Yadav

మోచేతి గాయం కారణంగా ముంబై ఇండియన్స్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, ఐపీఎల్ 2022 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్ ఆడబోయే మిగిలిన మూడు మ్యాచుల్లో సూర్యకుమార్ యాదవ్ ఆడడం లేదు...

58

గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచులకు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేడు. కేకేఆర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే రీఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్, హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు...

68

ఐపీఎల్ 2022 సీజన్‌లో 8 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్, 43.29 సగటుతో 303 పరుగులు చేశాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లో 68 పరుగులు చేసి అదరగొట్టాడు సూర్య...

78

యంగ్ బ్యాట్స్‌మెన్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఈ సీజన్‌లో 10 మ్యాచులాడి 328 పరుగులతో ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉండగా సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇషాన్ కిషన్ 270, రోహిత్ శర్మ 198 పరుగులు చేశారు...

88

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తిరిగి గాయపడడంతో అతనికి విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి కూడా సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
Bumrah : ఒక్క వికెట్ పడితే.. బుమ్రా సంచలనం !
Recommended image2
Sanju Samson: సంజూ శాంసన్ దెబ్బకు ఐసీసీ షేక్
Recommended image3
T20 World Cup 2026 : ఫైనల్ చేరే ఆ రెండు జట్లు ఇవే.. టీమిండియా సంగతేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved