- Home
- Sports
- Cricket
- IPL 2022: ఈడెన్ గార్డెన్స్‌లో ప్లేఆఫ్స్, అహ్మదాబాద్‌లో ఫైనల్... పూణేలో వుమెన్స టీ20 ఛాలెంజ్ ...
IPL 2022: ఈడెన్ గార్డెన్స్‌లో ప్లేఆఫ్స్, అహ్మదాబాద్‌లో ఫైనల్... పూణేలో వుమెన్స టీ20 ఛాలెంజ్ ...
ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ని విడుదల చేసింది భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ). ప్లేఆఫ్స్‌తో పాటు వుమెన్స్ టీ20 ఛాలెంజ్ షెడ్యూల్‌ని కూడా ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ...

మే 22న లీగ్ మ్యాచులు ముగుస్తుండగా మే 24న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటి క్వాలిఫైయర్ జరగనుంది. టేబుల్ టాపర్‌గా నిలిచిన మొదటి రెండు జట్లు ఈ క్వాలిఫైయర్‌లో పాల్గొంటాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి చేరుకుంటుంది...
మే 25న ఈడెన్ గార్డెన్స్‌లోనే ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరగనుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగో స్థానంలో నిలిచిన జట్లు ఈ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఓడిన జట్టు సీజన్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకుని టోర్నీ నుంచి నిష్కమిస్తుంది...
ఆ తర్వాత అహ్మదాబాద్‌కి చేరుకునే ఐపీఎల్, అక్కడ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో క్వాలిఫైయర్ 2, ఫైనల్ మ్యాచ్‌లు ఆడనుంది. మే 27న క్వాలిఫైయర్ 2 జరుగుతుంది...
క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గెలిచిన జట్టు, ఫైనల్ చేరి క్వాలిఫైయర్ 1 విజేతతో టైటిల్ పోరులో పాల్గొంటుంది. ఓడిన జట్టు సీజన్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకుని, టోర్నీ నుంచి నిష్కమిస్తుంది...
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నూరు శాతం ప్రేక్షకులను అనుమతించి, ఐపీఎల్ 2022 సీజన్ ఫ్లేఆఫ్స్ మ్యాచులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
అలాగే ఐపీఎల్ చివరి వారంలో వుమెన్స్ టీ20 ఛాలెంజ్ టోర్నీ నిర్వహించనుంది బీసీసీఐ. ఐపీఎల్ లీగ్ మ్యాచులు 22న ముగియనుండగా వుమెన్స్ టీ20 ఛాలెంజ్, మే 23న ప్రారంభం కానుంది...
పూణేలో మే 23, 24, 26 తేదీల్లో మ్యాచులు జరుగుతాయి. మొత్తంగా మూడు టీమ్స్ పాల్గొని, ఒక్కో జట్టు రెండు మ్యాచులు ఆడుతుంది...
టేబుల్ టాపర్‌గా నిలిచిన రెండు జట్ల మధ్య మే 28న వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. వచ్చే ఏడాది వుమెన్స్ ఐపీఎల్ ప్రారంభమవుతుందనే వార్తలు వస్తుండడంతో ఇది వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఆఖరి సీజన్ అయ్యే అవకాశం ఉంది.