- Home
- Sports
- Cricket
- అప్పుడు పొమ్మని వెళ్లగొట్టారు, ఇప్పుడు తిరిగి రమ్మని వేడుకుంటూ... దీపక్ హుడా పర్ఫామెన్స్‌తో...
అప్పుడు పొమ్మని వెళ్లగొట్టారు, ఇప్పుడు తిరిగి రమ్మని వేడుకుంటూ... దీపక్ హుడా పర్ఫామెన్స్‌తో...
దీపక్ హుడా... గత ఏడాదిన్నరగా వార్తల్లో నిలుస్తున్న ప్లేయర్. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ 2021 ఆరంభానికి ముందు అప్పటి బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యాతో విభేదాలతో జట్టుకే దూరమయ్యాడు దీపక్ హుడా... అప్పుడు పొమ్మంటూ హుడాపై ఏడాది నిషేధం విధించిన బరోడా క్రికెట్ అసోసియేషన్, ఇప్పుడు మళ్లీ రావాలంటూ బుజ్జగింపులు మొదలెట్టిందట..

బరోడా వైస్ కెప్టెన్‌గా ఉన్న దీపక్ హుడా, అప్పటి కెప్టెన్ కృనాల్ పాండ్యాతో గొడవపడి, జట్టుకి దూరమయ్యాడు. కృనాల్ పాండ్యాపై కంప్లైయింట్ ఇచ్చిన దీపక్ హుడాపై ఏడాది నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది బరోడా క్రికెట్ అసోసియేషన్.
దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఈ బరోడా మాజీ వైస్ కెప్టెన్, రాజస్థాన్ జట్టులో చేరి కెప్టెన్‌గా మారాడు. రాజస్థాన్ కెప్టెన్‌గా అద్భుతంగా రాణించి, టీమిండియాలో చోటు దక్కించుకోగలిగాడు...
‘జరిగిందేదో జరిగిపోయింది. మేం దీపక్ హుడాని తిరిగి బరోడా జట్టుకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కృనాల్ పాండ్యాతో అతనికి ఉన్న మనస్పర్థలు కూడా తొలిగిపోయాయి. కాబట్టి అతనికి బరోడాకి రాకపోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాం...’ అంటూ తెలిపాడు ఓ బరోడా క్రికెట్ అసోసియేషన్ అధికారి...
Deepak Hooda
ఐపీఎల్ 2022 సీజన్‌లో కృనాల్ పాండ్యా, దీపక్ హుడా ఇద్దరూ కూడా లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడుతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన దీపక్ హుడా 31.23 సగటుతో 406 పరుగులు చేశాడు...
2021 జనవరిలో సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ సమయంలో బరోడా జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న దీపక్ హుడాకి, కెప్టెన్ కృనాల్ పాండ్యాకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది... ఈ కారణంగానే టోర్నీ ఆరంభానికి ముందురోజు అర్ధాంతరంగా సయ్యద్ ముస్తాక్ ఆలీ లీగ్ నుంచి తప్పుకున్నాడు దీపక్ హుడా...
‘నేను 11 ఏళ్లుగా బరోడా క్రికెట్ అసోసియేషన్ తరుపున క్రికెట్ ఆడుతున్నాడు. ఈసారి సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. కానీ నేను ఇప్పుడు తీవ్రమైన మనోవేదనతో నలిగిపోతున్నా. కొన్నాళ్లు మా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా, నన్ను బూతులు తిడుతూ నరకయాతన పెడుతున్నాడు...
వడోదరలోని రిలయెన్స్ స్టేడియానికి ప్రాక్టీస్‌కి వచ్చిన బరోడా జట్టు సభ్యుల ముందు, ఇతక క్రికెటర్ల ముందు నన్ను నానా మాటలు అన్నాడు. మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కృనాల్ పాండ్యా వచ్చి, నాతో అసభ్యంగా ప్రవర్తించాడు...హెడ్ కోచ్ ప్రభాకర్ సూచనలతో ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పినా... ‘నేను కెప్టెన్‌ని, హెడ్ కోచ్ ఎవరు? నేనే బరోడా టీమ్...’ అంటూ బెదిరించి, దాదాగిరితో నన్ను ప్రాక్టీస్ చేయకుండా అడ్డుకున్నాడు...
Deepak Hooda
ప్రతీసారి నన్ను కించపరచాలని, కిందకి లాగేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు కృనాల్ పాండ్యా. బరోడాకి ఎలా ఆడతావో చూస్తానని, నీ క్రికెట్ కెరీర్‌ను నాశనం చేస్తానని చాలాసార్లు బెదిరించాడు... ఏడేళ్ల నుంచి నేను ఐపీఎల్ ఆడుతున్నా...’ అంటూ బరోడా క్రికెట్ అసోసియేషన్‌కి సుదీర్ఘమైన లేఖ రాశాడు దీపక్ హుడా...
కృనాల్ పాండ్యాపై కంప్లైయింట్ చేసిన హుడాకే దిమ్మతిరిగే షాక్ ఇస్తూ సస్పెషన్ వేటు వేసింది బరోడా క్రికెట్ అసోసియేషన్. హుడా కంప్లైంట్‌పై విచారణ చేసిన సుప్రీం కౌన్సిల్... అతనిపై ఏడాది పాటు దేశవాళీ సీజన్‌లో బరోడాకి ప్రాతినిధ్యం వహించకూడదంటూ నిషేధం విధించింది. దీంతో అతను బరోడా జట్టుకి రాజీనామా చేసి రాజస్థాన్‌లో చేరాడు.