- Home
- Sports
- Cricket
- ప్లేఆఫ్స్ దేవుడెరుగు! ముందు ఒక్క మ్యాచ్ గెలవనివ్వండి... ముంబై ప్లేయర్ జయ్‌దేవ్ ఉనద్కత్..
ప్లేఆఫ్స్ దేవుడెరుగు! ముందు ఒక్క మ్యాచ్ గెలవనివ్వండి... ముంబై ప్లేయర్ జయ్‌దేవ్ ఉనద్కత్..
ఐపీఎల్ 2022 సీజన్‌ని టైటిల్ ఫెవరెట్‌గా ఆరంభించింది ముంబై ఇండియన్స్. ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఈ సారి పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేసింది. మొదటి ఆరు మ్యాచుల్లో ఆరుకి ఆరు ఓడిన రోహిత్ సేన, దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్టే...

ఐదు మ్యాచులు ఓడిన తర్వాత కూడా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తామని, కప్ కొడతామని ఆశాభావం వ్యక్తం చేసిన ముంబై ఇండియన్స్ ప్లేయర్లు... ఆరో ఓటమి తర్వాత వాస్తవాన్ని గ్రహించినట్టే తెలుస్తోంది...
Jaydev Unadkat
ట్రెంట్ బౌల్డ్‌ను మెగా వేలానికి వదిలేసిన ముంబై ఇండియన్స్, జస్ప్రిత్ బుమ్రాకి సరైన పార్టనర్ కోసం వెతుకుతూనే ఉంది. జయ్‌దేవ్ ఉనద్కత్ ఐపీఎల్ 2022లో 3 మ్యాచులాడి 4 వికెట్లు తీయగలిగాడు...
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లేఆఫ్స్ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పటికైతే మొదటి విజయం కోసం ఎదురుచూస్తున్నాం. ఒక్క మ్యాచ్ గెలిస్తే.. ఆ తర్వాత మిగిలిన వాటి గురించి ఆలోచించొచ్చు...
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్... రెండూ ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్. ఆ విషయాన్ని అందరికీ మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం లేదు...
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్ నిజంగానే దిగ్గజాల సమరంలా ఉంటుంది. ఐపీఎల్‌కి ఓ రూపాన్ని ఇచ్చింది వాళ్లే (సీఎస్‌కే), మేం (ముంబై ఇండియన్స్) ఆ రూపానికి అందాలు దిద్దాం...’ అంటూ కామెంట్ చేశాడు జయ్‌దేవ్ ఉనద్కత్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆరు మ్యాచులాడి ఒకే విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 21న తలబడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది.