- Home
- Sports
- Cricket
- ఆమె వల్లే నీకు దరిద్రం పట్టుకుంది, విడాకులు ఇస్తే... విరాట్ కోహ్లీకి వివాదాస్పద క్రిటిక్ సలహా...
ఆమె వల్లే నీకు దరిద్రం పట్టుకుంది, విడాకులు ఇస్తే... విరాట్ కోహ్లీకి వివాదాస్పద క్రిటిక్ సలహా...
విరాట్ కోహ్లీ... క్రికెట్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. ఆయన పేరే ఓ బ్రాండ్. ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన క్రికెటర్. దశాబ్దకాలంలో 20 వేలకు పరుగులు చేసిన ఏకైక క్రికెటర్. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్ల సరైన ఫామ్‌లో లేడు...

రెండున్నరేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించలేకపోతున్నాడు విరాట్ కోహ్లీ. 70 సెంచరీలు చేసిన విరాట్, 71వ శతకం కోసం దాదాపు 50 ఇన్నింగ్స్‌లుగా వెయిట్ చేస్తూనే ఉన్నాడు...
అలాగే బీసీసీఐ పెద్దలతో విభేదాల కారణంగా వన్డే కెప్టెన్సీ కోల్పోయి, టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్న విరాట్ కోహ్లీ... ఐపీఎల్ 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు సార్లు రనౌట్ అయిన విరాట్ కోహ్లీ, వరుసగా రెండు మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మొత్తంగా విరాట్‌కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది...
సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ గాడ్‌కే ఇలాంటి పరిస్థితి తప్పలేదు. టెండూల్కర్‌కి పండ్ల వ్యాపారి నుంచి పనిలేని ప్రతీవాడు సలహా ఇచ్చేవాడు... ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఉచిత సలహాలు ఇచ్చేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది...
కొందరు విరాట్ కోహ్లీ ఈ టైమ్‌లో క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుని, కొంతకాలం గడిపితే బెటర్ అని సలహా ఇస్తే... మరికొందరు విరాట్ బ్యాటింగ్ టెక్నిక్, స్టైల్ మార్చుకోవాల్సిందిగా సూచించారు...
తాజాగా బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కేఆర్‌కే (కమల్ ఆర్ ఖాన్), టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వరుసగా ఫెయిల్ అవ్వడానికి ఆయన సతీమణి అనుష్క శర్మయే కారణమని అంటున్నాడు...
‘కోహ్లీకి అనుష్కయే బ్యాడ్ లక్. ఆమెకు విడాకులు ఇస్తేనే విరాట్ మళ్లీ పూర్వ ఫామ్‌లోకి వస్తాడు...’ అంటూ కమల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది...
కమల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సినిమా చూడడం కూడా రాకపోయినా సినిమాలు ఎలా తీయాలో వివరించే కమల్ లాంటి విమర్శించడమే పనిగా పెట్టుకుని పనిలేని క్రిటిక్స్ ఇచ్చే సలహాలు పట్టించుకునే పొజిషన్‌లో విరాట్ లేడని కామెంట్లు పెడుతున్నారు ఆయన అభిమానులు...
2017 డిసెంబర్‌లో అనుష్క శర్మను పెళ్లాడిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాతి ఏడాది 9 సెంచరీలు చేశాడని, 2019లో ఏడు సెంచరీలు చేశాడని కేఆర్‌కేకి తెలియకపోవచ్చని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
టైమ్ బాగోలేనప్పుడు ప్రతీ వెధవ సలహాలు ఇచ్చేందుకు ముందుకొస్తాడని, విరాట్ కోహ్లీకి వీరందరికీ సమాధానం ఎలా చెప్పాలో బాగా తెలుసని అంటున్నారు భారత క్రికెట్ జట్టు అభిమానులు...