- Home
- Sports
- Cricket
- మా ఇద్దరిదీ ఒకటే దారి కానీ అతడే నాకు స్పూర్తి.. పంజాబ్ ను గెలిపించిన ఆల్ రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు
మా ఇద్దరిదీ ఒకటే దారి కానీ అతడే నాకు స్పూర్తి.. పంజాబ్ ను గెలిపించిన ఆల్ రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు
TATA IPL 2022: ఐపీఎల్-2022 లో భాగంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఓడియన్ స్మిత్.

పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ ఓడియన్ స్మిత్.. తన సహచర ఆటగాడు, వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రూ రసెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడే తనకు స్పూర్తి అని.. తాను ఇలా ఆడటానికి అతడిచ్చిన ప్రోత్సాహమే కారణమని చెప్పాడు.
స్మిత్ మాట్లాడుతూ.. ‘నాకు ఆండ్రూ రసెల్ అంటే చాలా ఇష్టం. అతడే నాకు స్పూర్తి. టీ20లలో మా ఇద్దరివీ దాదాపు ఒకటే పాత్రలు. మ్యాచులను ఫినిష్ చేయడమనేది సాధారణమైన విషయమేమీ కాదు.
బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేసేప్పుడు.. ముఖ్యంగా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చేప్పుడు మేము హిట్టింగ్ కు దిగాల్సి ఉంటుంది. ఆ విషయంలో నేను రసెల్ ను చూసి చాలా నేర్చుకున్నాను. అతడు తన ఆటతో నేను మరింత ముందుకుపోవడానికి ఎప్పుడూ స్పూర్తినిస్తూనే ఉంటాడు..’ అని చెప్పాడు.
ఇంకా స్మిత్ మాట్లాడుతూ.. ఒక్క మ్యాచ్ గెలిపించగానే అయిపోలేదని, ఇంకా తాము సుదూర ప్రయాణం చేయాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. సీజన్ ఆద్యంతం రాణించి పంజాబ్ కు ట్రోఫీ అందించేందుకు తాను చేయగలిగిందంతా చేస్తానని స్మిత్ చెప్పాడు. తమ జట్టులో టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారని, అయితే తాను కూడా తన పాత్ర (ఆల్ రౌండర్) కు న్యాయం చేయాల్సి ఉందని వివరించాడు.
ఇదిలాఉండగా... ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచులో 206 పరుగుల లక్ష్య ఛేదనలో పీబీకేఎస్ విజయానికి స్మిత్ కీలక పాత్ర పోషించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన స్మిత్.. 8 బంతులే ఎదుర్కుని 25 పరుగులు చేశాడు.