- Home
- Sports
- Cricket
- IPL2021 RCBvsKKR: విరాట్ కోహ్లీకి 200వ ఐపీఎల్ మ్యాచ్... తెలుగు కుర్రాడు భరత్‌కి చోటు...
IPL2021 RCBvsKKR: విరాట్ కోహ్లీకి 200వ ఐపీఎల్ మ్యాచ్... తెలుగు కుర్రాడు భరత్‌కి చోటు...
IPL 2021 ఫేజ్ 2లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న తెలుగు కుర్రాడు కెఎస్ భరత్‌కి తుది జట్టులో చోటు దక్కింది...

కెప్టెన్‌గా ఇదే ఆఖరి సీజన్ అని విరాట్ కోహ్లీ ప్రకటించిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో వారి ఆటతీరు ఎలా ఉంటుందానని భారీ అంచనాలున్నాయి...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున విరాట్ కోహ్లీకి ఇది 200వ ఐపీఎల్ మ్యాచ్. ఒకే ఫ్రాంఛైజీకి 200వ మ్యాచులు ఆడుతున్న ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు కోహ్లీ...
ప్రస్తుతం టీ20ల్లో 9929 పరుగులతో ఉన్న విరాట్ కోహ్లీ, మరో 71 పరుగులు చేస్తే... పొట్టి ఫార్మాట్‌లో 10 వేల పరుగులు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు...
కేకేఆర్‌తో జరిగిన గత ఐదు మ్యాచుల్లో ఆర్‌సీబీ నాలుగు విజయాలు అందుకోగా, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కేవలం ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది...
ప్రాక్టీస్ మ్యాచ్‌లో 95 పరుగులు చేసి ఆకట్టుకున్న తెలుగు వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్, ఈ మ్యాచ్ ద్వారా ఆర్‌సీబీ తరుపున ఆరంగ్రేటం చేయబోతున్నాడు...
కేకేఆర్ జట్టు: శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, ఆండ్రే రస్సెల్, దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, లూకీ ఫర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ
ఆర్‌సీబీ జట్టు ఇది: విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్, వానిందు హసరంగ, సచిన్ బేబీ, కేల్ జెమ్మీసన్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, యజ్వేంద్ర చాహాల్