- Home
- Sports
- Cricket
- IPL2021: పంజాబ్ కింగ్స్‌కి భారీ షాక్... ఐపీఎల్ నుంచి తప్పుకున్న ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్...
IPL2021: పంజాబ్ కింగ్స్‌కి భారీ షాక్... ఐపీఎల్ నుంచి తప్పుకున్న ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్...
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పంజాబ్ కింగ్స్‌కి మరో ఊహించని షాక్ తగిలింది. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్, ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు అర్ధాంతరంగా ప్రకటించాడు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో సగం మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన క్రిస్ గేల్, ఈ సీజన్‌లో 10 మ్యాచులు ఆడి 193 పరుగులు చేశాడు...
ఐపీఎల్ ఆరంభానికి ముందు కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో పాల్గొన్న క్రిస్ గేల్, తర్వాత టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆడబోతున్నాడు...
Chris Gayle-Photo Credit BCCI
దీంతో టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు బయో బబుల్ జీవితానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు క్రిస్ గేల్...
‘బయో బబుల్ జీవితంతో విసిగిపోయా... కొన్నినెలలుగా బ్రేక్ లేకుండా క్రికెట్ ఆడుతుండడంతో బయో బబుల్ లైఫ్‌లో ఉండాల్సి వచ్చింది. అందుకే టీ20 వరల్డ్‌కప్‌కి ముందు మానసికంగా సిద్ధమయ్యేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నా...’ అంటూ ప్రకటించాడు క్రిస్ గేల్...
11 మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే అందుకున్న పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 4 పరుగులు చేయలేక 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది...
ప్లేఆఫ్ చేరాలంటే పంజాబ్ కింగ్స్ మిగిలిన మూడు లీగ్ మ్యాచుల్లోనూ కచ్ఛితంగా విజయం సాధించాల్సి ఉంటుంది... నేడు కేకేఆర్‌తో మ్యాచ్ ఆడనున్న పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత అక్టోబర్ 3న ఆర్‌సీబీతో, 7న సీఎస్‌కేతో మ్యాచులు ఆడుతుంది...
పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న కేకేఆర్‌కి కూడా పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్ గెలవడం చాలా కీలకం. అలాగే ఆర్‌సీబీ కూడా ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేందుకు పంజాబ్ కింగ్స్‌ను ఓడిస్తే సరిపోతుంది...
వరుస విజయాలతో ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను పంజాబ్ కింగ్స్ ఓడించడమంటే, అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మిగిలిన మూడు మ్యాచులు, పంజాబ్ కింగ్స్‌కి డూ ఆర్ డై మ్యాచులుగా మారాయి...