MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పిల్లాడితో ఎందుకు, దమ్ముంటే నాతో గొడవ పడు... క్రిస్ మోరిస్‌కి వార్నింగ్ ఇచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్...

పిల్లాడితో ఎందుకు, దమ్ముంటే నాతో గొడవ పడు... క్రిస్ మోరిస్‌కి వార్నింగ్ ఇచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్...

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో ఘోరంగా విఫలమవుతున్నాడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్. ఫస్టాఫ్‌లో బ్యాటుతో, బాల్‌తో రాణించి రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన క్రిస్ మోరిస్ వైఫల్యం, ఆర్‌ఆర్‌ను తీవ్రంగా దెబ్బ తీస్తోంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Sep 30 2021, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో ఏకంగా 50 పరుగులు సమర్పించాడు క్రిస్ మోరిస్. ఐపీఎల్ 2021 వేలంలో ఏకంగా రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసిన మోరిస్, ఇలా పరుగులు ఇవ్వడం రాజస్థాన్ రాయల్స్‌ను బాగా ఇబ్బందిపెడుతోంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

క్రిస్ మోరిస్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్, ఓ భారీ సిక్సర్ కొట్టాడు. దాంతో మోరిస్‌కి కోపం వచ్చి, భరత్ దగ్గరికెళ్లి ఏదో అన్నాడు...

37

నాన్‌స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, దాన్ని గమనించి... ‘పిల్లాడి మీద నీ ప్రతాపం చూపిస్తావేంటి... నేను ఇక్కడ ఉన్నా, దమ్ముంటే నాతో గొడవ పడు...’ అంటూ రిప్లై ఇచ్చాడు...

47

అన్నట్టుగానే ఆ తర్వాత 17వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన క్రిస్ మోరిస్‌పై బౌండరీలతో విరుచుకుపడ్డాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. ఆ ఓవర్‌లో ఓ సిక్స్, మూడు ఫోర్లు, రెండు టూడీలతో కలిపి 22 పరుగులు రాబట్టాడు...

57

35 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో అవుట్ కాగా... గ్లెన్ మ్యాక్స్‌వెల్ 30 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

67

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, సీజన్ మొత్తంలో 13 మ్యాచులు ఆడి ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. అయితే ఈసారి మాత్రం రాయల్ ఛాలెంజర్స్‌కి కీలక ప్లేయర్‌గా మారిపోయాడు మ్యాక్స్‌వెల్...

77

11 మ్యాచుల్లో 38.88 సగటుతో 350 పరుగులు చేశాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. ఇందులో 4 హాఫ్ సెంచరీలు, 33 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. బాల్‌తోనూ రాణించి మూడు వికెట్లు తీశాడు మ్యాక్స్‌వెల్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Recommended image2
Riyan Parag Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో
Recommended image3
IPL 2026 Final: ఫైనల్‌కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ ట్రోఫీ ఎవరికి దక్కుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved