MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021 Final: ఇది ఐపీఎల్ ‘లగాన్’... అందరి ఓటు చెన్నై సూపర్ కింగ్స్‌కే, గంభీర్ మాత్రం కేకేఆర్ వైపు...

IPL 2021 Final: ఇది ఐపీఎల్ ‘లగాన్’... అందరి ఓటు చెన్నై సూపర్ కింగ్స్‌కే, గంభీర్ మాత్రం కేకేఆర్ వైపు...

ఐపీఎల్ 2021 సీజన్‌కి ఎట్టకేలకు శుభం కార్డు పడనుంది. అప్పుడెప్పుడో ఏప్పిల్‌లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్, కరోనా కారణంగా వాయిదా పడి, యూఏఈలో తిరిగి ప్రారంభమై విజయవంతంగా కథ క్లైమాక్స్‌కి చేరుకుంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 15 2021, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఐపీఎల్ 2021 ఫైనల్‌లో కేకేఆర్, సీఎస్‌కే తలబడబోతున్నాయి. అయితే ఈ ఫైట్‌ను చాలామంది ‘లగాన్’ మూవీతో పోలుస్తుండడం విశేషం. కారణం కేకేఆర్ జట్టుకి ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహిస్తుండడమే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కేకేఆర్ టీమ్‌కి విదేశీ కెప్టెన్ ఉండడంతో అందరి చూపు సీఎస్‌కే పైకే మళ్లింది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్, నాలుగో టైటిల్ గెలవబోతుందని ఆశిస్తున్నారు అభిమానులు...

39

భారత మాజీ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ కూడా మాత్రం ఓ ఫజిల్‌తో ఐపీఎల్ 2021 టైటిల్ ఏ జట్టు గెలుస్తుందో కామెంట్ చేశాడు... ‘వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్సీలో, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోచ్‌గా ఉన్న జట్టు టైటిల్ గెలుస్తుందని ట్వీట్ చేశాడు..’ వసీం జాఫర్...

49

అయితే సీఎస్‌కే కెప్టెన్ మాహీ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కాగా, ఆ జట్టు కోచ్ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్... అలాగే కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా 2019 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కాగా, ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ న్యూజిలాండ్ మాజీ క్రికెటరే...

59

ఓ జట్టు ఫైనల్ చేరిన ప్రతీసారి టైటిల్ గెలిచిన జట్టు కాగా, మరోటి అత్యధిక సార్లు ఫైనల్ చేరి, అత్యధిక సార్లు రన్నరప్‌గా నిలిచినది... ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని, ఫైనల్ ఫైట్ ఆసక్తికరంగా సాగాలని కోరుకుంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

69

అయితే ఎక్కువ శాతం చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవాలని కోరుకుంటున్నారు. సీఎస్‌కే కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి సీజన్ కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, మాహీ టైటిల్ గెలిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు...

79

కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మాత్రం.... ‘కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టైటిల్ గెలిచి, సీఎస్‌కే టైటిల్స్ రికార్డును సమం చేయాలని’ కోరుకుంటున్నట్టు కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కూడా సీఎస్‌కే ఫ్యాన్స్‌కి మరింత సంతోషాన్నిస్తోంది...

89

గౌతమ్ గంభీర్ ఏం చెప్పినా, ఏది అంచనా వేసినా... దానికి రివర్స్‌లో జరుగుతుందని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయం. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటిదాకా అలాగే జరుగుతూ వచ్చింది కూడా...

99

దీంతో గంభీర్ చెప్పాడు కాబట్టి కేకేఆర్ ఫైనల్‌లో ఓడిపోతుందని, టైటిల్ చెన్నై సూపర్ కింగ్స్‌దేనని ఫిక్స్ అయిపోయారు. అయితే బాద్‌షా ఫ్యాన్స్‌ మాత్రం బాధల్లో ఉన్న షారుక్ ఖాన్‌కి కేకేఆర్ టైటిల్ గెలిచి, కొద్దిగా ఊరట నివ్వాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Richa Ghosh: రిచా ఘోష్‌ను అక్కడ ఆడిస్తే ప్రత్యర్థులకు చుక్కలే.. టీమిండియాకు వరల్డ్ కప్ పక్కా !
Recommended image2
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image3
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved