MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సామి శిఖరం.. ఆయన ఆటను చూడటం మా అదృష్టం.. ధోని ఇన్నింగ్స్ కు ఫిదా అయిన ఢిల్లీ బ్యాట్స్మెన్

సామి శిఖరం.. ఆయన ఆటను చూడటం మా అదృష్టం.. ధోని ఇన్నింగ్స్ కు ఫిదా అయిన ఢిల్లీ బ్యాట్స్మెన్

IPL2021: ఒక్క మ్యాచ్.. ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్.. క్రికెట్ లో జీరోలను హీరోలుగా.. హీరోలుగా చేయడంలో ఆ ఒక్క మ్యాచే కీలకం. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పై ఇంటా బయటా విమర్శలే. కానీ ఒక్క ఇన్నింగ్స్.. కాదు కాదు.. ఆరు బంతులతోనే తానెంత విలువైన ఆటగాడినో ఫ్రాంచెైజీకి, విమర్శకులకు చెప్పకనే చెప్పాడు ధోని. ధోని అభిమానుల్లో ఒకడైన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పృథ్వీ షా.. అతడి ఆటకు ఫిదా అయ్యాడు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 11 2021, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో  ధోని సారథ్యంలోని సీఎస్కే విజయం సాధించిన విషయం  తెలిసిందే. ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చిన ధోని.. తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. అయితే ధోని ఆటను ప్రత్యక్షంగా  వీక్షించిన ఢిల్లీ బ్యాట్స్మెన్ పృథ్వీ షా మాత్రం.. అతడి ఆటను దగ్గర్నుంచి  చూడటం తన అదృష్టమని అన్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మ్యాచ్ అనంతరం షా మాట్లాడుతూ... ఎంఎస్ ధోని ప్రత్యేక ఆటగాడు.  ఆ విషయం అందరికీ తెలుసు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులెన్నింటినో ఆయన ధీటుగా ఎదుర్కొన్నాడు. అలాంటి వాటిని మనం చాలా చూశాం. ధోని క్రీజులో ఉన్న ప్రతిసారి అతడు డేంజర్ ప్లేయరే. 

37

నా వరకు ధోని ఆటను, నాయకత్వాన్ని  ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ధోని మా నుంచి గేమ్ ను లాగేసుకున్నాడని  షా చెప్పాడు. 

47

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా వచ్చిన పృథ్వీ.. 34 బంతుల్లో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. 

57

తన బ్యాటింగ్ గురించి షా మాట్లాడుతూ.. నా ఆట పట్ల నేను సంతోషంగానే ఉన్నాను. కానీ సుదీర్ఘ ఇన్నింగ్స్ లు ఆడటం నేను నేర్చుకోవాలి. ఆ క్రమంలో నాకు ఇదొక గుణపాఠం. ఇలాంటి పరిస్థితి నాకు మళ్లీ ఎదురైతే అప్పుడు ఎక్కువ సేపు క్రీజులో ఉండటానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. 

67


ఈ మ్యాచ్ లో  తమ ఆటగాళ్లు చాలా బాగా ఆడారని, ఫైనల్స్ కు వెల్లడానికి తమకు మరో ఛాన్స్ కూడా ఉన్నదని షా అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించినా ఓటమి ఎదురైనప్పుడు బాధగా ఉంటుందని, జట్టు సభ్యులంతా దీనికి చింతిస్తున్నామని షా తెలిపాడు. 

77

173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే డూప్లెసిస్ ఔటైనా.. తర్వాత వచ్చిన ఊతప్ప (63), రుతురాజ్ (70) లు ఆదుకున్నారు.  ఆఖర్లో ధనాధన్ ధోని 6 బంతుల్లో ఒక సిక్సర్, మూడు ఫోర్లతో సీఎస్కే విజయాన్ని ఖాయం చేశాడు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Recommended image2
Riyan Parag Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో
Recommended image3
IPL 2026 Final: ఫైనల్‌కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ ట్రోఫీ ఎవరికి దక్కుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved