- Home
- Sports
- Cricket
- కెప్టెన్‌గా మాహేంద్ర సింగ్ ధోనీ 200వ ఐపీఎల్ మ్యాచ్... టాప్ 5లో ఉన్న కెప్టెన్లు వీరే...
కెప్టెన్‌గా మాహేంద్ర సింగ్ ధోనీ 200వ ఐపీఎల్ మ్యాచ్... టాప్ 5లో ఉన్న కెప్టెన్లు వీరే...
మోస్ట్ సక్సెస్‌ఫుల్ భారత సారథిగా రికార్డు క్రియేట్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్‌లోనూ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడు. మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ కెప్టెన్‌గా 200వ మ్యాచ్ ఆడుతున్నాడు...

ఐపీఎల్‌లో 3 సార్లు చెన్నై సూపర్ కింగ్స్‌కి టైటిల్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, రికార్డు స్థాయిలో 10 సార్లు ఫ్లేఆఫ్స్‌కి తీసుకెళ్లాడు...
ఏ జట్టూ సాధించనట్టుగా 8 సార్లు ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్, 2021 సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది...
2008 నుంచి 2021 వరకూ కెప్టెన్‌గా కొనసాగుతున్న ఒకే ఒక్క ప్లేయర్... ఒకే జట్టుకి అత్యధిక సీజన్లుగా కెప్టెన్‌గా కొనసాగుతున్న రికార్డు కూడా మహేంద్ర సింగ్ ధోనీ పేరిటే ఉన్నాయి...
ఐపీఎల్‌లో 100 మ్యాచులకు కెప్టెన్సీ వహించిన మహేంద్ర సింగ్ ధోనీ, 150 మ్యాచులకు, 200 మ్యాచులకు కెప్టెన్సీ వహించిన మొట్టమొదటి ఐపీఎల్ కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
టాప్ 2లో విరాట్ కోహ్లీ: మహేంద్ర సింగ్ ధోనీ, 200 మ్యాచులకు కెప్టెన్సీ చేస్తూ ఐపీఎల్ కెప్టెన్‌గా టాప్‌లో ఉంటే, ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ...
ఆర్‌సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ, 2008 నుంచి ఒకే జట్టుకి ఆడుతున్న ఏకైక ప్లేయర్. ఐపీఎల్‌లో 136 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్, ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే ఆఖరి సీజన్ అని ప్రకటించిన విషయం తెలిసిందే...
టాప్ 3 గౌతమ్ గంభీర్: ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టుకి రెండు టైటిల్స్ అందించిన కెప్టెన్ గౌతమ్ గంభీర్, తన కెరీర్‌లో 129 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు...
టాప్ 4 రోహిత్ శర్మ: ముంబై ఇండియన్స్‌కి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ, తన కెరీర్‌లో 127 మ్యాచులతో టాప్ 4లో ఉన్నాడు...
ఈ సీజన్‌లో గౌతమ్ గంభీర్ రికార్డును అధిగమించబోతున్న రోహిత్ శర్మ, వచ్చే సీజన్‌లో విరాట్ కోహ్లీ రికార్డును కూడా అధిగమించడం ఖాయం... మరో ఐదు సీజన్లు, ఐపీఎల్‌లో కొనసాగితేనే మాహీ రికార్డును చేరుకోగలడు రోహిత్ శర్మ...
టాప్ 5 ఆడమ్ గిల్‌క్రిస్ట్: మూడు సీజన్లలో డెక్కన్ ఛార్జర్స్ జట్టుకి, మరో మూడు సీజన్లతో పంజాబ్ కింగ్స్‌కి ఆడిన ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌కిస్ట్, 74 ఐపీఎల్ మ్యాచులకు కెప్టెన్సీ వహించి టాప్ 5లో ఉన్నాడు...