IPL 2021: కోట్లు పోసి కొన్నా ఏం లాభం! కొన్నది 16 కోట్లకు.. తీసింది 15 వికెట్లు.. ఇక క్రిస్ మోరిస్ కథ కంచికే..
Chris Morris: ఐపీఎల్ 2021 వేలంలో ఎవరూ ఊహించని విధంగా ధర పలికిన ఆటగాడు క్రిస్ మోరిస్. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ ఆల్ రౌండర్ ఐపీఎల్ లో తమ రాత మారుస్తాడని రాజస్థాన్ రాయల్స్ భారీ ఆశలు పెట్టుకుంది. రాత మార్చడమేమో గానీ పెట్టిన పైసలకు ఫలితం దక్కలేదని తలలు పట్టుకుంటున్నది.
IPL-14 సీజన్ కు గాను నిర్వహించిన వేలంలో క్రిస్ మోరిస్ ను Rajastan royals అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. ఈ దక్షిణాఫ్రికా ఆటగాడి మీద ఏకంగా రూ. 16.25 కోట్లు పెట్టింది.
మోరిస్ కు అంత పెట్టి కొనడం అవసరమా..? అని అప్పుడే చాలా మంది పెదవి విరిచారు. కానీ రాజస్థాన్ యజమాన్యం మాత్రం మోరిస్ ఎంపికను సమర్థించుకుంది. తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచి ఆ తర్వాత అదేదో మాకు సంబంధం లేదన్న విషయంగా మారిన ఆ జట్టు తలరాతను మోరిస్ మారుస్తాడని భావించింది.
కాల చక్రం గిర్రున తిరిగింది. కట్ చేస్తే.. రాజస్థాన్ తలరాతను మోరిస్ మార్చకపోగా కొన్నిసార్లు ఇతడిని ఇంత డబ్బు వెచ్చింది ఎందుకు కొనుక్కున్నాంరో భగవంతుడా అని తలలు పట్టుకుంది.
ఈ ఐపీఎల్ సీజన్ లో 11 మ్యాచ్ లాడిన మోరిస్.. 15 వికెట్లు తీశాడు. అవి కూడా కీలక సమయాల్లో తీసినవైతే కాదు. ఇక బ్యాటింగ్ లో కూడా ఇరగదీస్తాడని అనుకుంటే.. 11 మ్యాచులలో కలిపి అతడు చేసినవి అక్షరాలా 67 పరుగులు.
ఇది కూడా చదవండి: IPL 2021: ఈ సీజన్ లో తేలిపోయిన ఐదుగురు కెప్టెన్లు వీళ్లే.. వచ్చే ఐపీఎల్ లో వీరికి ఉధ్వాసన తప్పదా..?
మరో విధంగా చూస్తే.. మోరిస్ కు రాయల్స్ 16.25 కోట్లు ఖర్చు పెట్టగా అతడు తీసిన వికెట్ ఒక్కంటికి (మొత్తం 15 వికెట్లు) కోటి ఖర్చు అయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఒక్కో పరుగుకు రూ. 24.25 లక్షల చొప్పున మొత్తం 67 పరుగులకు ఆ మొత్తాన్ని లెక్కగడుతున్నారు ఆ జట్టు అభిమానులు.
ఈ సీజన్ లో రాజస్థాన్ కప్పు సంగతి అటు పెడితే కనీసం ప్లే ఆఫ్స్ కు కూడా అర్హత సాధించడంలో దారుణంగా విఫలమైంది. మోరిస్ ఇలా విఫలమవడం ఇదే ప్రథమం కాదు. దీంతో అతడిపై పెట్టుకున్న అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా మోరిస్ ను రూ. 10 కోట్లకు కొనుక్కుంది. ఆ సీజన్ లో 9 మ్యాచ్ లు ఆడిన అతడు.. 11 వికెట్లు పడగొట్టి 34 పరుగులు చేశాడు. మరి వరుసగా రెండు సీజన్లలో విఫలమైన ఈ అత్యంత ఖరీదైన ఆటగాడిని వచ్చే ఐపీఎల్ లో ఏదైనా జట్టు చేజిక్కించుకుంటుందో లేదో చూడాలి.