సన్‌రైజర్స్‌కి మరో షాక్... గాయంతో ఐపీఎల్‌కు దూరమైన విజయ్ శంకర్...

First Published 31, Oct 2020, 3:30 PM

IPL 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు ప్లేయర్లు గాయాల కారణంగా ఐపీఎల్ మొత్తం దూరం కాగా, కేన్ విలియంసన్ గాయపడి రెండు మ్యాచులు ఆడలేదు. తాజాగా మరో ప్లేయర్ గాయం కారణం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ గాయం కారణంగా 2020 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డాడు విజయ్ శంకర్. దీంతో ఆ ఓవర్‌ను డేవిడ్ వార్నర్ వేసి పూర్తిచేశాడు.

చేతి వేళ్ల మధ్య గాయం కారణంగా అది తగ్గడానికి చాలా సమయం పడుతుందని తెలియచేశారు వైద్యులు.

దీంతో 2020 సీజన్ మొత్తానికి విజయ్ శంకర్ దూరం కానున్నాయి. మొదటి మ్యాచ్‌లో డకౌట్ కావడమే కాకుండా గాయపడిన మిచెల్ మార్ష్ ఓవర్ పూర్తివేసేందుకు రెండు నో బాల్స్ వేసి ఒకే బంతిలో 10 పరుగులు ఇచ్చారు.

అయితే భువీ, కేన్ విలియంసన్ గాయాలతో దూరం కావడంతో ఆరెంజ్ ఆర్మీలోకి రీఎంట్రీ ఇచ్చిన విజయ్ శంకర్... మంచి ఇన్నింగ్స్ ఆడాడు.

రాజస్థాన్ రాయల్స్‌పై హాఫ్ సెంచరీ చేసిన విజయ్ శంకర్, మనీశ్ పాండేతో కలిసి మూడో వికెట్‌కి 140 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన విజయ్ శంకర్... మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో గాయపడి సీజన్ నుంచి దూరమయ్యాడు.

12 మ్యాచుల్లో 5 మ్యాచుల్లో మాత్రమే గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక గెలిచి తీరాల్సిందే.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి మ్యాచుల్లో ఈ సీజన్‌లో టాప్ టీమ్స్‌గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లతో తలబడుతోంది.

ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిస్తే ఫేఆఫ్ చేరుతుంది.

గాయాలతో కీలక ఆటగాళ్లను కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచినా ప్లేఆఫ్ బెర్త్ చేరడానికి మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.