రిషబ్ పంత్ వర్సెస్ సంజూ శాంసన్... సంజూనే తోపు అంటున్న నెటిజన్స్...
IPL 2020: మహేంద్ర సింగ్ ధోనీ... అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ ప్లేస్ కోసం రిషబ్ పంత్, సంజూ శాంసన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఐపీఎల్‌లో పర్ఫామెన్స్ ఆధారంగా ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే డిస్కర్షన్ జరుగుతోంది.
IPL 2020 సీజన్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తూ ప్లేఆఫ్‌కి బాగా దగ్గరైంది ఢిల్లీ క్యాపిటల్స్.
మరోవైపు మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత ఆ రేంజ్ ప్రదర్శన ఇవ్వలేక ప్లేఆఫ్ నుంచి దూరమైంది.
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ అయిన ఆ ప్లేస్ భర్తీ చేయగల వికెట్ కీపర్ ఎవరంటే... ఐపీఎల్‌కి ముందు చాలామంది రిషబ్ పంత్‌కే ఓటు వేశారు
అయితే ఐపీఎల్ మొదలైన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. మొదటి రెండు మ్యాచుల్లో అద్భుత హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు సంజూ శాంసన్
రెండు హాఫ్ సెంచరీలతో అదరగొట్టి, సంజూ శాంసన్‌కి భారత జట్టులో ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదనే చర్చ లేవనెత్తడానికి కారణమయ్యాడు.
అయితే ఆ తర్వాత వరుసగా 9 మ్యాచుల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు సంజూ శాంసన్. నిలకడ లోపంతో మరోసారి ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు.
గత మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాజస్థాన్ రాయల్స్‌ను బెన్‌స్టోక్స్ కలిసి 140 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు సంజూ శాంసన్.
హాఫ్ సెంచరీతో అదరగొట్టి, మరోసారి నెటిజన్ల మనసు దోచుకున్నాడు సంజూ శాంసన్. 12 మ్యాచుల్లో 326 పరుగులు చేశాడు రాజస్థాన్ ప్లేయర్. ఇందులో 23 సిక్సర్లు ఉన్నాయి.
మరోవైపు రిషబ్ పంత్ ఈ సీజన్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. దూకుడుగా ఆడే పంత్, 8 మ్యాచుల్లో కలిసి ఆరు సిక్సర్లు మాత్రమే బాదాడు.
బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్‌లో కూడా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు రిషబ్ పంత్. దీంతో ధోనీ ప్లేస్‌కి రిషబ్ పంత్ కంటే సంజూ శాంసన్ అయితేనే బెటర్ అని అంటున్నారు ఫ్యాన్స్.