IPL 2020: పంజాబ్ ఫెయిల్యూర్... కెఎల్ రాహుల్ కెప్టెన్సీయే కారణమా...
IPL 2020 సీజన్ 13లో కూడా పంజాబ్ జట్టు రాత మారలేదు. 13 సీజన్లుగా ఎంత మంది కెప్టెన్లను మార్చినా, జెర్సీ రంగులు ఎన్నిసార్లు మార్చినా... పేరులో ఎన్ని మార్పులు చేసినా ఆటతీరులో మాత్రం ఎలాంటి తేడా కనిపించడం లేదు. ఈ సీజన్‌లో పటిష్టమైన జట్టుగా కనిపించిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫెయిల్యూర్‌కి కారణమేంటి...

కెఎల్ రాహుల్ కెప్టెన్సీ: కెఎల్ రాహుల్ దూకుడైన ఆటగాడు. సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా మాత్రం విఫలమవుతున్నాడు రాహుల్. గత మ్యాచ్‌లో కేవలం తనకొచ్చిన ఆరెంజ్ క్యాప్ ధరించడానికే వికెట్ కీపింగ్ చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. 16 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న కెఎల్ రాహుల్ తన స్టైల్‌లో బ్యాటింగ్ చేసి ఉంటే... స్కోరు 200+ దాటి ఉండేది.

మయాంక్‌పైనే భారం: మయాంక్ అగర్వాల్ సీజన్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. మయాంక్, కెఎల్ రాహుల్ బ్యాటింగ్ కారణంగానే అంతో ఎంతో పోరాడుతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. అయితే ఈ ఇద్దరికీ మద్ధతు ఇచ్చేవారు కనిపించడం లేదు.

క్రిస్ గేల్: క్రిస్ గేల్ వంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌కి జట్టులో చోటు ఇవ్వలేకపోతున్నాడు కెఎల్ రాహుల్. అతనిస్థానంలో జట్టులోకి వచ్చిన ప్లేయర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు.

మ్యాక్స్‌వెల్: క్రికెట్‌లో సరికొత్త షాట్లను పరిచయం చేసిన ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. మ్యాక్స్‌వెల్‌పై ఎంతో నమ్మకం ఉంచి, వరసగా అవకాశాలు ఇస్తున్నాడు కెఎల్ రాహుల్. కానీ సర్ఫరాజ్ ఖాన్ భారీ షాట్లు ఆడిన సమయంలో మ్యాక్స్‌వెల్ హిట్టింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. మ్యాక్స్‌వెల్ ఆడితే పంజాబ్ స్కోరు మరోలా ఉండేది...

మురుగన్ అశ్విన్: రవిచంద్రన్ అశ్విన్‌ను వదులుకున్న పంజాబ్, మురుగన్ అశ్విన్‌ని అంటిపెట్టుకుంది. ఈ యంగ్ బౌలర్ ఆడిన రెండు మ్యాచుల్లో బాగానే ఆకట్టుకున్నాడు. ఒకే మ్యాచ్‌లో 3 వికెట్లు కూడా తీశాడు. కానీ అతన్ని తీసి పక్కనబెట్టింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. బాగా రాణిస్తున్నా మురుగన్‌కి జట్టులో ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో క్లారిటీ లేదు.

బిష్ణోయ్‌పై బరువు: అండర్ 19 యంగ్ సెన్సేషన్ రవి బిష్ణోయ్‌పై మోయలేనంత బరువు మోపుతోంది పంజాబ్. మొదటి రెండు మ్యాచుల్లో రాణించిన బిష్ణోయ్, ఆ తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు. టాలెంట్‌ను ఎలా వాడుకోవాలో అనుభవం లేని కెప్టెన్‌కి అర్థం కావడం లేదు.

నికోలస్ పూరన్: సీజన్‌లో అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు నికోలస్ పూరన్. చెన్నైతో మ్యాచ్‌లో 17 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. కానీ సూపర్ ఓవర్‌లో పూరన్ అవుట్ అవ్వడం అతడిని ఒత్తిడిని ఎలా ఫేస్ చేస్తాడో చెప్పడానికి ఉదాహరణ.

కాట్రెల్: వికెట్ తీసిన తర్వాత సెల్యూట్ చేసిన కాట్రెల్, సీజన్‌లో భారీగా పరుగులు ఇచ్చాడు. రాజస్థానతో జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు ఇచ్చింది కాట్రెల్‌యే.

షమీ: మహ్మద్ షమీ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. భారీగా పరుగులు ఇవ్వకుండా అడ్డుకోగలుగుతున్నాడు. అయితే మొదటి రెండు మ్యాచుల్లో చూపించినంత ప్రభావం, తర్వాత మ్యాచుల్లో చూపలేకపోయాడు. వరుస పరాజయాలు షమీ బౌలింగ్‌పై ప్రభావం చూపుతున్నాయి.

ముజీబుర్ రెహ్మాన్: ఆఫ్ఘాన్ క్రికెట్‌లో సంచలన బౌలర్‌గా గుర్తింపు పొందిన ముజీబుర్‌ను పంజాబ్ కొనుగోలు చేసింది. కానీ భారీగా పరుగులిచ్చిన నీషమ్, జోర్డాన్ వంటి బౌలర్‌పైన పెట్టిన నమ్మకం ముజీబ్‌పైన పెట్టలేకపోతున్నాడు కెఎల్ రాహుల్. జోర్డాన్, జేమ్స్ నిషమ్ వంటి బౌలర్లకు అవకాశం ఇచ్చాడు కానీ ముజీబుర్‌కి ఇప్పటిదాకా జట్టులో చోటు ఇవ్వలేదు.

బౌలింగ్ ఫెయిల్యూర్: సీజన్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. షేన్ వాట్సన్ అయితే ఫామ్‌లోనే లేడు. అలాంటి చెన్నై, పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించింది. అయితే పంజాబ్ బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక కష్టమేగా: ఐదు మ్యాచుల్లో నాలుగు పరాజయాలు అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ వారికి కీలకం కానుంది. అన్ని మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది. అయినా మిగిలిన జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సిన పరిస్థితి.