ముందు ఈ కెప్టెన్‌ని మార్చేయండి... గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు...
IPL 2020 సీజన్‌లో మొదటి రెండు మ్యాచుల్లో అదిరిపోయే విజయాలు అందుకుంది రాజస్థాన్ రాయల్స్. అయితే ఆ తర్వాతే సీన్ మారిపోయింది. షార్జాలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్... ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఉన్న పరిస్థితికి ప్లేఆఫ్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే.

ప్లేఆఫ్ రేసులో నిలవాంటే మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ విజయాలు సాధించడంతో పాటు మిగిలిన జట్ల పర్ఫామెన్స్‌పై ఆధారపడాల్సి ఉంటుంది ఆర్ఆర్. రాజస్థాన్ తన తర్వాతి మ్యాచుల్లో పంజాబ్, కేకేఆర్‌లతో తలబడనుంది.

సంజూ శాంసన్‌తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా వరుస మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడు. ముందుండి నడిపించాల్సిన స్మిత్, ముందుగానే అవుటై పెవిలియన్ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది.
12 మ్యాచుల్లో 276 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్... మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 69 పరుగులు మాత్రమే.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 11 పరుగులకే అవుటయ్యాడు స్టీవ్ స్మిత్. దీంతో 196 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్, స్మిత్ ఫెయిల్యూర్ కారణంగా 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే కీలక మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్‌తో కలిసి సంజూ శాంసన్ 142 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, జట్టుకి కీలక విజయాన్ని అందించాడు. దీంతో స్టీవ్ స్మిత్‌ను ట్రోల్ చేశాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.
‘నాకు తెలిసి రాజస్థాన్ రాయల్స్‌కి ఉన్న ప్రధాన సమస్య కెప్టెన్ స్టీవ్ స్మిత్. మొదటి రోజు నుంచి నేను ఇదే చెబుతున్నా. ఆర్ఆర్ బెటర్ పర్ఫామెన్స్ ఇవ్వాలంటే, స్మిత్ జట్టు నుంచి తప్పుకుని మరో ప్లేయర్‌కి అవకాశం ఇవ్వాలి...’ అని షాకింగ్ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్.
స్టీవ్ స్మిత్‌తో పోలిస్తే సంజూ శాంసన్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. 12 మ్యాచుల్లో 326 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలే ఉన్నా 23 సిక్సర్లతో సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు సంజూ శాంసన్.
స్టీవ్ స్మిత్‌తో పోలిస్తే బ్యాటింగ్ ఆర్డర్‌లో చివరన వచ్చే రాహుల్ తెవాటియా కాస్త మంచి ప్రదర్శనే ఇచ్చాడు. లోయర్ ఆర్డర్‌లో వచ్చినా 12 మ్యాచుల్లో 224 పరుగులు చేయడమే కాకుండా 7 వికెట్లు తీశాడు రాహుల్ తెవాటియా.
ఒక మ్యాచ్ లేటుగా వచ్చిన ఓపెనర్ జోస్ బట్లర్ 11 మ్యాచుల్లో 271 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బట్లర్ కెప్టెన్ అయితే రాజస్థాన్ రాయల్స్ బెటర్ పర్ఫామెన్స్ ఇస్తుందని అభిప్రాయపడ్డాడు గౌతీ.
స్మిత్ ఆసీస్‌కి కెప్టెన్‌గా వ్యవహారించినా, ఐపీఎల్‌లో జట్టును నడిపించడంలో స్టీవ్ స్మిత్ ఫెయిల్ అవుతున్నాడని అభిప్రాయపడుతున్నాడు గౌతమ్ గంభీర్.