సడెన్‌గా ధోనీని గుర్తుచేసుకున్న బీసీసీఐ... కారణం ఇదేనా...

First Published 28, Oct 2020, 8:09 PM

మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్ జట్టుకి లెజెండరీ మాజీ కెప్టెన్. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా భారత క్రికెట్ జట్టును రెండు సార్లు విశ్వవిజేతగా నిలపడమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌ అందించిన ఏకైక కెప్టెన్. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ తర్వాత అత్యధిక విజయాలు అందించిన సారథి ధోనీయే. మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన చాలారోజుల తర్వాత మాహీని మళ్లీ గుర్తు చేసుకుంది బీసీసీఐ.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్ స్టేజ్ చేరువవుతున్న దశలో ఆకస్మాత్తుగా ట్విట్టర్‌లో బ్యాక్‌గ్రౌండ్ పిక్‌ని మార్చేసింది బీసీసీఐ అధికారిక ఖాతా. ‘థ్యాంక్యూ ఎమ్మెస్ ధోనీ...’ అంటూ మహేంద్ర సింగ్ ధోనీ భారతీయ జెర్సీలో నవ్వుతున్న ఫోటోను పెట్టింది బీసీసీఐ.

ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ఆగస్టు 15, 2020 స్వాతంత్ర్య దినోత్సవాన ప్రకటించాడు. ఆ రోజున మాహీ గురించి వరుస పోస్టులు చేసింది బీసీసీఐ.

మళ్లీ ఇన్నాళ్లకు మహేంద్ర సింగ్ ధోనీపై బీసీసీఐకి సెడన్‌గా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి కారణం మాత్రం ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ 2020 సీజన్‌లో ఇచ్చిన ప్రదర్శనే.

ఏ సీజన్‌లోనూ లేనంతగా వరుస మ్యాచుల్లో ఘోరంగా విఫలమై ప్లేఆఫ్ నుంచి దూరమైన మొట్టమొదటి జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ ప్రదర్శన కారణంగా మహేంద్ర సింగ్ ధోనీపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

అందుకే నెటిజన్లకు ధోనీ గొప్పదనాన్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో మరోసారి మహేంద్రసింగ్ ధోనీకి థ్యాంక్స్ చెబుతూ బ్యాక్‌గ్రౌండ్ పిక్ పెట్టింది బీసీసీఐ.

ఇంతకుముందు 2007 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు గ్రూప్ దశ నుంచే నిష్కమించిన సమయంలో ధోనీ ఇంటిపై దాడి చేశారు అభిమానులు. వరల్డ్ కప్‌లో విఫలమైన ధోనీ దిష్టిబొమ్మలను, ఫోటోలను తగలబెడుతూ నిరసన వ్యక్తం చేశారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తూ పోస్టు చేసిన వీడియోలో ఈ దృశ్యాలు కూడా ఉంటాయి.

2019 వన్డే వరల్డ్‌కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ భారీ షాట్లు కొట్టడానికి ఇబ్బంది పడినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఈ సీజన్‌లో ధోనీ బ్యాటింగ్‌లో ఫెయిల్ అవుతుండడంతో మాహీ కూతురు జీవాపై అత్యాచార బెదిరింపులు కూడా వచ్చాయి.

అందుకే ప్లేఆఫ్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తప్పుకోగానే బీసీసీఐ, అభిమానులకు మాహీ భారత జట్టుకి అందించిన విజయాలను గుర్తుచేసేందుకు ప్రయత్నించింది.

రాజస్థాన్ రాయల్స్‌, ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనంతరం సీఎస్‌కే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోగానే మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ కూడా ‘ఆటను ఆటగానే చూడాలని...’చెబుతూ భారీ ఎమోషనల్ పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

‘మిస్టర్ కూల్’, ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఈ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ధోనీ భక్తులు సచిన్ టెండూల్కర్‌లానే, భారత జట్టుకు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహేంద్రుడికి కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.