MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వరల్డ్ కప్ ఆడాలనుకున్నా! కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు... దీపక్ చాహార్ కామెంట్..

వరల్డ్ కప్ ఆడాలనుకున్నా! కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు... దీపక్ చాహార్ కామెంట్..

2018లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన దీపక్ చాహార్, తక్కువ కాలంలో టీమిండియాకి ప్రధాన బౌలర్‌గా మారాడు. అయితే గాయాలతో టీమ్‌కి దూరమైన దీపక్ చాహార్, రెండేళ్లుగా రీఎంట్రీ కోసం కష్టపడుతూనే ఉన్నాడు...
 

Chinthakindhi Ramu | Published : Sep 21 2023, 03:23 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Image credit: PTI

Image credit: PTI

టీ20ల్లో 7 పరుగులకే 6 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేసిన దీపక్ చాహార్, బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ కూడా తీశాడు.. వన్డేల్లో ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్న యజ్వేంద్ర చాహాల్, కొన్ని మ్యాచులను తన బ్యాటింగ్‌తోనూ గెలిపించాడు..
 

28
Image credit: PTI

Image credit: PTI

ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో దీపక్ చాహార్ ఇప్పటిదాకా ఆడింది 7 వన్డేలు, 24 టీ20 మ్యాచులు మాత్రమే. చివరిగా 2022 డిసెంబర్‌లో వన్డే మ్యాచ్ ఆడిన దీపక్ చాహార్, గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీ ఆడే అవకాశాన్ని చేజార్చుకున్నాడు..

38
Image credit: PTI

Image credit: PTI

‘గాయాలు ఏ ప్లేయర్‌ని బాధపెట్టవు, ఎందుకంటే అవి మా చేతుల్లో ఉండవు. అయితే టీమ్‌కి అందుబాటులో ఉండలేకపోతున్నామనే బాధే ఎక్కువగా ఉంటుంది. నాకు అవకాశం వచ్చిన ప్రతీసారీ 100 శాతం ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటా..
 

48
Asianet Image

నా టైం బాగోలేదని చాలామంది అన్నారు. అయితే గత ఏడాది నేను వెన్నెముక సమస్యతో బాధపడ్డాను. ఫాస్ట్ బౌలర్‌కి వెన్నెముక గాయం చాలా పెద్ద తలనొప్పి. కానీ ఇప్పుడు దాని నుంచి పూర్తిగా కోలుకున్నా..

58
Image credit: Getty

Image credit: Getty

ఇప్పుడు నా బౌలింగ్ పర్ఫామెన్స్, నాకు సంతృప్తినిచ్చింది. తిరిగి భారత జట్టులోకి రావడం కోసం ఎదురుచూస్తున్నా. ఈ మధ్య రాజస్థాన్ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పీఎల్) ఆడాను. గత ఆదివారం వరకూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలోనే ఉన్నాను..

68
Asianet Image

ఆసియా గేమ్స్ కోసం చైనా వెళ్తున్న భారత జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశా. ఏ ప్లేయర్‌కి అయినా వరల్డ్ కప్ గెలవడానికి మించిన అఛీవ్‌మెంట్ ఉండవు. నేను కూడా ప్రపంచ కప్ ఆడాలని కలలు కన్నాను. నాకు అవకాశం వస్తుందని ఆశించా..

78
Asianet Image

నేను ఆడిన చాలా టోర్నీల్లో టీమిండియా గెలిచింది. 2018లో నా మొదటి ఆసియా కప్‌లో మనమే గెలిచాం. ఆరు ఐపీఎల్ సీజన్లలో ఐదు సార్లు ఫైనల్ ఆడా. అందులో మూడు సార్లు టైటిల్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నా..

88
Asianet Image

ధోనీతో నా అనుబంధం క్రికెట్‌కి అతీతమైనది. మహీ భాయ్‌తో కలిసి సమయం గడిపే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అతను నాకు అన్నయ్య, నా ఐడల్. ఓ ప్లేయర్‌గా, ఓ మనిషిగా ఆయనంటే నాకెంతో గౌరవం..’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెటర్ దీపక్ చాహార్.. 

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu
 
Recommended Stories
Top Stories