INDvsSL 2nd T20I: విఫలమైన భారత బ్యాట్స్‌మెన్... లంక ముందు ఈజీ టార్గెట్...
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆకట్టుకున్నా, పిచ్ బ్యాటింగ్‌కి సహకరించకపోవడంతో భారత బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి తెగ ఇబ్బందిపడ్డారు.
తొలి వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన తర్వాత యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 18 బంతుల్లో ఓ ఫోర్‌తో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
పిచ్ బ్యాటింగ్‌కి సహకరించకపోవడం, లంక స్పిన్నర్లు అదరగొడుతుండడంతో శిఖర్ ధావన్ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించడానికి ప్రాధాన్యం ఇచ్చాడు. దీంతో రన్‌రేట్ తగ్గుతూ పోయింది.
42 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేసిన శిఖర్ ధావన్‌ను అఖిల ధనంజయ క్లీన్ బౌల్డ్ చేశాడు. 81 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు...
23 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్, హసరంగ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కి ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు...
13 బంతుల్లో 7 పరుగులు చేసిన సంజూ శాంసన్ కూడా ధనంజయ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్రీజు ముందుకొచ్చి షాట్ ఆడాడు. అయితే బంతి, బ్యాటును తాకి వికెట్లను గిరాటేసింది...
ఆఖరి ఓవర్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నితీశ్ రాణా 12 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ కాగా... భువనేశ్వర్ కుమార్ 11 బంతుల్లో 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
లంక బౌలర్లలో అఖిల ధనంజయ రెండు వికెట్లు తీయగా హసరంగ, శనక, చమీరాలకు తలా ఓ వికెట్ దక్కాయి. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక ఏకంగా 8 మంది బౌలర్లను ఉపయోగించడం విశేషం.