INDvsENG 3rd Test: రోహిత్ శర్మ అవుట్, రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా...
మూడో టెస్టులో తొలిసారిగా టీమిండియా ఓ సెషన్‌లో పూర్తి ఆధిపత్యం కనబర్చింది. తొలి సెషన్ ఆఖరి బంతికి కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయిన భారత జట్టు, లంచ్ బ్రేక్ తర్వాత వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేసి ఆకట్టుకునే పర్పామెన్స్ ఇచ్చింది. అయితే టీ బ్రేక్ తర్వాత రోహిత్ శర్మ రూపంలో ఓ కీలక వికెట్ కోల్పోయింది టీమిండియా.
టీ బ్రేక్ సమయానికి ఓ వికెట్ కోల్పోయి 112 పరుగులు చేసింది టీమిండియా. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 242 పరుగుల దూరంలో ఉంది భారత జట్టు.
టీ బ్రేక్ తర్వాత కొద్దిసేపటికే 156 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసిన రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది టీమిండియా. రాబిన్‌సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు రోహిత్. రివ్యూకి వెళ్లినా అంపైర్ కాల్‌గా రావడంతో నిరాశ తప్పలేదు.
రోహిత్ శర్మకి ఇది టెస్టుల్లో 14వ హాఫ్ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో రెండోది. ఈ ఏడాది ఐదు హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, ఓవరాల్‌గా అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్లలో మూడో స్థానంలో నిలిచాడు.
సిరీస్‌లో రోహిత్ శర్మ 100+ బంతులను ఎదుర్కోవడం ఇది నాలుగోసారి. ఇంగ్లాండ్‌లో సునీల్ గవాస్కర్ తర్వాత అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన భారత ఓపెనర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ...
వన్‌డౌన్‌లో వచ్చిన ఛతేశ్వర్ పూజారా 72 బంతుల్లో 7 ఫోర్లతో 40 పరుగులు చేసి... దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సాధారణంగా 100 బంతులు ఆడినా 20 పరుగులలోపే పరుగులు చేసే పూజారా, ఈ ఇన్నింగ్స్‌లో మాత్రం తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు...
ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు రాబిన్‌సన్ బౌలింగ్‌లోనే జో రూట్ రివ్యూ తీసుకోవడానికి ఆలస్యం చేయడంతో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు రోహిత్ శర్మ...
రాబిన్‌సన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీలు చేసింది ఇంగ్లాండ్. అయితే అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రివ్యూ తీసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తూ ఉండిపోయిన జో రూట్, సిగ్నల్ ఇవ్వడానికి ఆలస్యం చేశాడు...
జో రూట్ రివ్యూకి అప్పీలు చేసినా, అప్పటికే 15 సెకన్లు దాటిపోవడంతో అంపైర్లు దాన్ని తిరస్కరించారు. రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించింది...
టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకోవాలంటే మూడో సెషన్‌తో పాటు రేపు మొత్తం బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది... అప్పుడే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అధిగమించి, ప్రత్యర్థికి రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని నిర్ణయించగలుగుతుంది...