MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • INDvsENG 2nd Test: తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్... మన బౌలర్లు రాణిస్తే...

INDvsENG 2nd Test: తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్... మన బౌలర్లు రాణిస్తే...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 364 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్ స్కోర్ 276/3 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు 88 పరుగుల తేడాతో మిగిలిన ఏడు వికెట్లు కోల్పోవడం విశేషం... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 13 2021, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తొలి రోజు ఓపెనర్ రోహిత్ శర్మ 145 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 83 పరుగులు చేయగా, ఛతేశ్వర్ పూజారా 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. 103 బంతుల్లో 3 ఫోర్లతో 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, తొలి రోజు ఆట చివర అవుట్ అయ్యాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

250 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్‌తో 129 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, రెండో రోజు తాను ఎదుర్కొన్న రెండో బంతికే అవుట్ అయ్యాడు. ఓల్లీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో సిబ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరిన కెఎల్ రాహుల్, లార్డ్స్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

38

రాహుల్ అవుటైన తర్వాత కొద్దిసేపటికే అజింకా రహానే కూడా పెవిలియన్ చేరాడు. నిన్న 22 బంతులాడి 1 పరుగు మాత్రమే చేసిన రహానే... నేడు తాను ఎదుర్కొన్న మొదటి బంతికే అవుట్ అయ్యాడు. అండర్సన్ బౌలింగ్‌లో మొదటి బంతికే జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రహానే.

48

282 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయిన భారత జట్టును రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం అందించారు...

58

58 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసిన రిషబ్ పంత్... మార్క్ వుడ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పంత్ అవుటైన తర్వాత మహ్మద్ షమీ, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు...

68

మహ్మద్ షమీ వికెట్, మొయిన్ ఆలీకి టెస్టుల్లో భారత్‌కి 50వ వికెట్ కావడం విశేషం. షమీ అవుటైన తర్వాత 8వ వికెట్‌కి జడేజాతో కలిసి 26 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ఇషాంత్ శర్మ... ఈ ఇద్దరూ 13 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు.

78

29 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన ఇషాంత్ శర్మ, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా జస్ప్రిత్ బుమ్రా కూడా అతని బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

88

ఐదు వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్, టెస్టుల్లో 31వ సారి ఈ ఫీట్ నమోదుచేశాడు. 120 బంతుల్లో 3 ఫోర్లతో 40 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. మార్క్ వుడ్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కి తెరపడింది.

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Recommended image2
Vaibhav Suryavanshi: టీమిండియాలోకి వైభవ్.. ఒక్క మ్యాచ్‌కి ఎంత సంపాదిస్తాడో తెలుసా.?
Recommended image3
IND vs AFG Test: ఆఫ్గానిస్తాన్‌పై భార‌త్ పూర్తి ఆధిప‌త్యం.. తొలి రెండు రోజుల్లోనే మ్యాచ్‌పై ప‌ట్టు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved