MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • ద‌మ్మున్న బౌలింగ్.. భార‌త పేస్ అటాక్ ప్రపంచంలోని ఏ జట్టుకైనా సవాలు విసురుతుంది: మహ్మద్ షమీ

ద‌మ్మున్న బౌలింగ్.. భార‌త పేస్ అటాక్ ప్రపంచంలోని ఏ జట్టుకైనా సవాలు విసురుతుంది: మహ్మద్ షమీ

Mohammed Shami: ప్ర‌పంచంలోని ఏ జ‌ట్టునైనా టీమిండియా పేస్ బౌలింగ్ స‌వాల్ చేస్తుంద‌ని భారత స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ అన్నాడు. జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ గాయం కారణంగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ కు షమీ దూరమయ్యాడు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 09 2024, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami: ప్రస్తుతం చీలమండ గాయంతో జ‌ట్టుకు దూరమైన ప్రధాన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Mohammed Shami

Mohammed Shami

జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో తన పునరావాసం బాగానే జరుగుతోందనీ, ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపికయ్యేందుకు అందుబాటులో ఉంటానని అర్జున అవార్డు అందుకోవ‌డానికి ముందు ష‌మీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 

37
shami 1

shami 1

'నా పునరావాసం బాగానే ఉంది, నా పురోగతిపై ఎన్సీఏలోని వైద్య నిపుణులు సంతోషంగా ఉన్నారు. నా చీలమండలో కొద్దిగా నొప్పి ఉంది కానీ, అది బాగానే ఉంది. నేను నా శిక్షణా సెషన్లను ప్రారంభించాను. ఇంగ్లాండ్ సిరీస్ లో నేను పునరాగమనం చేయగలనని నేను నమ్ముతున్నాను. నా పునరాగమనమే ఈ సిరీస్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నా' అని 33 ఏళ్ల ఈ స్టార్ ప్లేయ‌ర్ పేర్కొన్నాడు.

47
Mohammad Shami

Mohammad Shami

జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ గాయం కారణంగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ కు షమీ దూరమయ్యాడు. అలాగే, భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ టీ20 సిరీస్ నుంచి కూడా విశ్రాంతి నిచ్చింది బీసీసీఐ. అయితే, ఇంగ్లాండ్ తో జ‌ర‌గ‌బోయే టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉంటాడ‌ని తెలుస్తోంది. 

57
mohd shami

mohd shami

కేప్ టౌన్ లో సౌతాఫ్రికాపై రెంటో టెస్టులో టీమిండియా చారిత్రాత్మ‌క విజ‌యంపై స్పందించిన మ‌హ్మ‌ద్ ష‌మీ.. 'రెండో టెస్టులో మేం బాగా ఆడాం.. అందరూ రాణించారు.. మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. భారత్ అద్భుత పునరాగమనం చేసి సిరీస్ ను సమం చేసింది. దురదృష్టవశాత్తు, గాయం కారణంగా నేను టెస్టులో భాగం కాలేక‌పోయాను. కానీ నేను వీలైనంత త్వరగా క్రికెట్ లోకి తిరిగి రావాలనుకుంటున్నాను. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో నేను మళ్లీ ఆడగల‌న‌ని ఆశిస్తున్నా' అని పేర్కొన్నాడు. 

67

జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, తన ప్రస్తుత భారత పేస్ త్రయంపై ప్రశంసల జల్లు కురిపించిన షమీ..  'ప్రపంచంలోని అత్యుత్తమ పేస్ అటాక్ ల‌లో మనది ఒకటని నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలను. వన్డే వరల్డ్ క‌ప్ సమయంలో మీరు చూశారు. దక్షిణాఫ్రికా సిరీస్ లో రెండో టెస్టులో జస్ప్రీత్, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రపంచంలోని ఏ జట్టుకైనా సవాలు విసరడానికి మా పేస్ అటాక్ సరిపోతుందని నేను చెప్పగలను' అని ష‌మీ పేర్కొన్నాడు.

77
Mohammed Shami

Mohammed Shami

కాగా, అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన చేసినందుకు భారత పేసర్ మహ్మద్ షమీకి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో సంచలన బౌలింగ్ చేసిన ష‌మీ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిఫారసు చేసింది. ఐసీసీ 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ష‌మీ 7 మ్యాచ్ లో 3 ఐదు వికెట్లతో సహా 24 వికెట్లు పడగొట్టాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Recommended image2
Smriti Mandhana: ఒకే మ్యాచ్‌లో రెండు వరల్డ్ రికార్డ్స్.. మిథాలీ, లానింగ్ రికార్డులను బద్దలుకొట్టిన స్మృతి మంధాన
Recommended image3
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved