- Home
- Sports
- Cricket
- మేం ఇద్దరం తప్పుకుని, వాళ్లిద్దరినీ ఆడించమంటావా... రిపోర్టర్‌కి పంచ్ ఇచ్చిన రోహిత్ శర్మ...
మేం ఇద్దరం తప్పుకుని, వాళ్లిద్దరినీ ఆడించమంటావా... రిపోర్టర్‌కి పంచ్ ఇచ్చిన రోహిత్ శర్మ...
విరాట్ కోహ్లీ సక్సెస్‌ఫుల్ కెప్టెన్, అయితే ఆవేశాన్ని ఆపుకోలేదు. రోహిత్ శర్మ చాలా కూల్, అంతకుమించి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో పర్ఫెక్ట్‌గా తెలిసిన తెలివైన వాడు. తాజాగా మరోసారి దీన్ని రుజువు చేశాడు రోహిత్ శర్మ...

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఆన్‌లైన్ ద్వారా మీడియాతో ముచ్చటించాడు రోహిత్ శర్మ. ఆ సమావేశంతో విలేకరులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో సమాధానాలు ఇచ్చాడు...
టీమిండియా టెస్టు కెప్టెన్సీ తీసుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు తాను ఇప్పటికైతే పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఫోకస్ పెట్టానని కామెంట్ చేసిన రోహిత్ శర్మ, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కూడా ముఖ్యమని తెలిపాడు...
రోహిత్ శర్మ కామెంట్లను బట్టి చూస్తుంటే, ఈ వయసులో వన్డే, టీ20లతో పాటు టెస్టు కెప్టెన్సీ తీసుకోవడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది...
అయితే టెస్టు కెప్టెన్సీ గురించి ఇప్పుడే ఏం చెప్పలేనని, దాని గురించి ఏమీ ఆలోచించడం లేదని చెప్పాడు టీమిండియా నయా వైట్ బాల్ సారథి రోహిత్ శర్మ...
టాప్ 3లో కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదని, రుతురాజ్ గైక్వాడ్‌ను ఎందుకు ఆడించడం లేదని ఓ మీడియా ప్రతినిధి, రోహిత్ శర్మను ప్రశ్నించాడు...
ఈ ప్రశ్నకు తన స్టైల్‌లో వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు రోహిత్. ‘అంటే ఇప్పుడు నేను, శిఖర్ ధావన్ తప్పుకుని... ఆ ప్లేస్‌లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లను ఆడించాలంటావా?’ అంటూ తిరిగి ప్రశ్నించాడు...
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పటిష్టమైన జట్టును తయారుచేశాడని, ఆ టీమ్‌లో మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరమేమీ లేదని రోహిత్ శర్మ కామెంట్ చేశాడు...
‘సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్, అంతకుముందు ఓ సిరీస మాత్రమే కోల్పోయాం. విరాట్ కోహ్లీ వన్డే విన్నింగ్ పర్సెంటేజ్ 70+గా ఉంది. అతన్ని ఫెయిల్యూర్ కెప్టెన్ అని ఎలా అంటారు...
కాబట్టి విరాట్ కోహ్లీ టీమ్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి అవసరమైతే కొన్ని మార్పులు ఉంటాయి. అంతేకానీ జట్టును పూర్తిగా మార్చే ప్రయత్నం చేయను... ’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ...
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ అయినా తర్వాత ఓ విలేఖరి, అతని స్థానంలో మరో ప్లేయర్‌ను ప్రయత్నిస్తారా? అంటూ విరాట్‌ను ప్రశ్నించాడు...
ఆ సమయంలో ‘టీ20ల్లో రోహిత్ శర్మను పక్కనబెట్టాలా?’ అంటూ ఆశ్చర్యపోతూ తిరిగి ప్రశ్నించాడు విరాట్. రోహిత్ చెప్పిన వెటకారపు సమాధానానికి, విరాట్ కోహ్లీ అగ్రెసివ్‌నెస్‌కి చాలా తేడా ఉందంటున్నారు అభిమానులు...