- Home
- Sports
- Cricket
- ఒకే ఓవర్ లో 7 సిక్సర్లు కొట్టాడు... క్రికెట్ చరిత్రలో తొలిసారి అసాధ్యమైన రికార్డు !
ఒకే ఓవర్ లో 7 సిక్సర్లు కొట్టాడు... క్రికెట్ చరిత్రలో తొలిసారి అసాధ్యమైన రికార్డు !
Indian player hits 7 sixes in a single over: క్రికెట్ లో ఎన్నో ఆసాధ్యం అనుకున్న రికార్డులను పలువురు ప్లేయర్లు సుసాధ్యం చేశారు. అలాంటిదే ఒకే ఓవర్ లో వరుసగా 7 సిక్సర్లు కొట్టాడు. ఈ అద్భుతమైన రికార్డును ఒక భారత ప్లేయర్ సాధించాడు. ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Indian player hits 7 sixes in a single over: ఎంతో మంది లెజెండరీ ప్లేయర్లు క్రికెట్ లో ఎన్నో రికార్డులు సాధించిన ఒక్క రికార్డు మాత్రం సాధించలేకపోయారు. అదే ఒకే ఓవర్ లో 7 సిక్సర్లు బాదడం. కానీ, ఒక భారత ప్లేయర్ సాధించాడు. అది సచిన్ కాదు, విరాట్ కోహ్లీ కాదు, రోహిత్ శర్మ కాదు.. మరి ఎవరు?
Sachin-Virat Kohli-Rohit Sharma
ఏ ఫార్మాట్ క్రికెట్ లో అయిన నిబంధనల ప్రకారం ఒక ఓవర్‌లో 6 బంతులు ఉంటాయి. ప్రతి బంతికి ఒక సిక్స్ మాత్రమే కొట్టవచ్చు. కాబట్టి ఒక ఓవర్‌లో గరిష్టంగా 6 సిక్సర్లు కొట్టవచ్చు. కానీ, ఒక టీమిండియా బ్యాట్స్‌మన్ ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టి ప్రత్యేకమైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టడం దాదాపు అసాధ్యం. అయితే, ఒక భారత బ్యాట్స్‌మన్ ఈ అద్భుతం చేసి చరిత్ర సృష్టించాడు.
ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టిన క్రికెటర్ ఎవరు?
28 నవంబర్ 2022న, భారత డాషింగ్ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా అద్భుతమైన బ్యాటింగ్ తో అసాధ్యం అనుకునే రికార్డును సుసాధ్యం చేశాడు. అదే క్రికెట్‌లో తొలిసారిగా ఒక బ్యాట్స్‌మన్ ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టాడు. దేశీయ క్రికెట్‌లో మహారాష్ట్ర తరఫున ఆడుతున్నప్పుడు, విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఈ ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ 28 నవంబర్ 2022న మహారాష్ట్ర-ఉత్తరప్రదేశ్ మధ్య జరిగింది.
క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఈ అసాధ్యమైన రికార్డు సాధ్యం చేసిన రుతురాజ్ గైక్వాడ్
మహారాష్ట్ర తరఫున ఆడుతున్నప్పుడు, రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టాడు. ఈ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా 7 సిక్సర్లు కొట్టగలిగాడు ఎందుకంటే ఆ ఓవర్ లో బౌలర్ ఒక నో బాల్ కూడా వేశాడు. రుతురాజ్ గైక్వాడ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ శివ సింగ్ బౌలింగ్ ను చిత్తుచేశాడు. ఈ ఓవర్లో శివ సింగ్ మొత్తం 7 బంతులు వేశాడు, అందులో ఒక నో బాల్ కూడా ఉంది. ఈ 7 బంతుల్లోనూ, రుతురాజ్ గైక్వాడ్ వరుసగా 7 సిక్సర్లు బాదాడు. శివ సింగ్ వేసిన ఈ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ మొత్తం 43 పరుగులు సాధించాడు.
159 బంతుల్లో అజేయంగా 220 పరుగులు చేసిన రుతురాజ్
ఉత్తరప్రదేశ్‌తో జరిగిన ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రితురాజ్ గైక్వాడ్ 159 బంతుల్లో 220 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్ నుండి 10 ఫోర్లు, 16 సిక్సర్లు వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్ భారతదేశం తరపున 6 వన్డేలు, 23 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ వన్డేల్లో 115 పరుగులు, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 633 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను 66 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 2380 పరుగులు చేశాడు, ఇందులో 2 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి.