కోహ్లీకి రూల్స్ వర్తించవా... విరాట్ పద్ధతి మార్చుకుంటే బెటర్... భారత కెప్టెన్‌పై వీరూ ఫైర్...
First Published Dec 5, 2020, 3:51 PM IST
భారత జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ కలిసి ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఇద్దరి రూట్ మారిపోయింది. కోహ్లీని ఇన్నాళ్లు గంభీర్ విమర్శిస్తూ వస్తే, అతన్ని సపోర్టు చేస్తూ వచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కోహ్లీకి హ్యాట్సాఫ్ అంటూ గంభీర్ కామెంట్ చేస్తే... కోహ్లీ కెప్టెన్సీపై ఫైర్ అయ్యాడు వీరేంద్ర సెహ్వాగ్.

తొలి రెండు వన్డేల్లో ఓడిన తర్వాత మూడో వన్డేలో జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న మహమ్మద్ షమీతో పాటు మొదటి వికెట్‌కి రాణించిన రెండు మ్యాచుల్లోనూ 50+ భాగస్వామ్యం నెలకొల్పిన మయాంక్ అగర్వాల్‌కి జట్టులో చోటు దక్కలేదు.

మొదటి టీ20లో అయితే జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, యజ్వేంద్ర చాహాల్‌కి అవకాశం ఇవ్వలేదు కోహ్లీ. జడేజా గాయపడడంతో లక్కీగా జట్టులో వచ్చిన చాహాల్ మూడు వికెట్లు తీయడంతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. లేదంటే పరిస్థితి వేరేగా ఉండేది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?