- Home
- Sports
- Cricket
- Champions Trophy: పాకిస్తాన్ బుద్దే అంత.. మ్యాచ్ లో భారత జెండా ఊపినందుకు తీసుకెళ్లి కొట్టారు !
Champions Trophy: పాకిస్తాన్ బుద్దే అంత.. మ్యాచ్ లో భారత జెండా ఊపినందుకు తీసుకెళ్లి కొట్టారు !
Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో భారత జెండాను ఊపుతున్న క్రికెట్ అభిమానిని భద్రతా సిబ్బంది అక్కడి నుంచి లాక్కెళ్లి కొట్టారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

Pakistan, cricket, Champions Trophy, india, india flag
Champions Trophy: 29 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ICC ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. తన మూడు నగరాల్లో రావల్పిండి, కరాచీ, లాహోర్‌లలో నిర్వహిస్తోంది. ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో, భారత క్రికెట్ జట్టు పాక్ వెళ్లడానికి నో చెప్పడంతో భద్రతా సమస్యల కారణంగా దుబాయ్ మ్యాచ్ లను ఆడుతోంది. భారత జట్టు పాక్ కు వెళ్లకపోయినా అక్కడ ఇండియా కు అభిమానుల కొరత లేదు. ఈక్రమంలోనే వెలుగులోకి వచ్చిన ఒక వీడియోతో మరోసారి పాకిస్తాన్ వక్రబుద్ది కనిపించింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ నిర్వహించడం ఇప్పటికే సంస్థాగత లోపాల కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది. సోమవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఒక మ్యాచ్ సందర్భంగా ఒక అభిమాని భారత జెండాను ఊపినందుకు భద్రతా సిబ్బంది ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తీసుకెళ్లి అతన్ని కొట్టారని కొత్త వివాదం మొదలైంది. ఈ విషయాన్ని అనేక మీడియా రిపోర్టులు నివేదించాయి. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Image Credit: Getty Images
ఆ వీడియోలలో అధికారులు ఆ వ్యక్తిని లాగి అతని చేతుల నుండి భారత జెండాను లాక్కుంటున్నట్లు కనిపిస్తోంది. అక్కడి నుంచి అతన్ని లాక్కెళ్లారు. అధికారులు ఆ వ్యక్తి గుర్తింపు లేదా జాతీయతను వెల్లడించలేదు. దీనికి సంబంధించిన విషయాలపై ఇంకా ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు.
ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అక్కడ నల్ల ప్యాంటు, నల్ల జాకెట్, ఏవియేటర్ సన్ గ్లాసెస్ ధరించిన ఒక క్రికెట్ అభిమాని భారత జెండాను ఊపుతూ కనిపించాడు. ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న వీడియోలో పలువురు అధికారులు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి సీటింగ్ ఏరియా నుండి బలవంతంగా లాక్కెళ్లడం కనిపించింది. అయితే అతను భారత పౌరుడా? కాదా? అక్కడ ఏం జరిగింది అనే విషయాలపై అక్కడి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే, భారత జెండను పట్టుకున్నందుకే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Indian Flag Sparks Controversy In Lahore As Security Officials Detain Cricket Fan
పాక్ తీరుపై నెటిజన్ల ఆగ్రహం
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భద్రతా సిబ్బంది చేసిన ఈ పని సమర్థనీయం కాదనీ, ఈ చర్యలు పాకిస్తాన్‌లో భారత్ పై లోతైన ద్వేషాన్ని ప్రతిబింబిస్తున్నాయంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. చాలా మంది ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటన రెండు దేశాల మధ్య విద్వేషపూరిత క్రికెట్ సంబంధాల గురించి చర్చలను మరింత తీవ్రతరం చేసింది.
భద్రత, క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా పాక్ చర్యలు
ఈ వివాదం టోర్నమెంట్‌లో పెరుగుతున్న భద్రతా సమస్యల్లో ఒకటిగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌కు సురక్షితమైన గమ్యస్థానంగా పాకిస్తాన్ తనను తాను తిరిగి స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఇలాంటి సంఘటనలు దాని ప్రయత్నాలను దెబ్బతీస్తాయి. కేవలం జెండా ప్రదర్శనకు దూకుడుగా స్పందించడం వల్ల విదేశీ అభిమానులు, ఆటగాళ్లు పాకిస్తాన్‌లో భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో ఎలా పాల్గొంటారు అనే విషయం మరిచిపోయినట్లుంది పాకిస్తాన్. భారత్-పాకస్తాన్ సంబంధాలు చారిత్రాత్మకంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇలాంటి చర్యలు మరింత ఉద్రిక్తతలను పెంచవచ్చు. క్రీడాస్ఫూర్తిని దెబ్బకొడుతూ టోర్నీ ప్రారంభం రోజున టోర్నీలో పాల్గొనే దేశాలతో పాటు భారత జెండాను ఉంచకుండా విమర్శలు ఎదుర్కొన్న పాక్.. ఇప్పుడు మరోసారి జెండా పట్టుకున్నందుకు అభిమానిని స్టేడియం నుంచి లాక్కెళ్లడం పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సంబంధిత పూర్తి వీడియోలు ఇక్కడ చూడండి👇
1. పాక్ లో భారత జెండాతో క్రికెట్ అభిమాని
2. పాక్ స్టేడియంలో భారత జెండా పట్టుకున్న క్రికెట్ అభిమానిని లాక్కెళ్లారు
Indian Flag Karachi
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి ఆతిథ్య దేశం పాక్ ఔట్
ఇదిలా వుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయి టోర్నీనుంచి ఔట్ అయింది. రావల్పిండిలో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు టోర్నమెంట్ నుండి నిష్క్రమించాయి. ఈ రెండు టీమ్ లో లీగ్ మ్యాచ్ లో చివరి మ్యాచ్ ఆడి బయటకు పోతాయి. పాక్ ను ఓడించిన న్యూజిలాండ్, భారత జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.