ఆ గాయమే ఓడించింది... డాక్టర్‌ను తప్పుపట్టలేం... ఓటమిపై ఆరోన్ ఫించ్...
First Published Dec 4, 2020, 6:38 PM IST
INDvsAUS: మొదటి టీ20లో ఓటమిని ఆస్ట్రేలియా జీర్ణించుకోలేకపోతోంది. ఓడిపోవడం కంటే సబ్‌స్టిట్యూబ్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చిన యజ్వేంద్ర చాహాల్... మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎన్నికవ్వడం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మరింత బాధపెడుతోంది. మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని తెలిపాడు ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్.

‘జడేజా ఫిట్‌గా లేడని భారత జట్టు డాక్టర్ చెప్పాడు. మెడికల్ ఎక్స్‌పర్ట్ చెప్పిన దాన్ని మనం ఛాలెంజ్ చేయలేం... డెత్ ఓవర్లలో మేం ఎక్కువగా పరుగులు ఇచ్చింది...

లక్ష్యచేధనలో బౌండరీలు ఎక్కువగా కొట్టలేకపోయాం. ముఖ్యంగా ఆఖరి ఆరు ఓవర్లలో రావాల్సినన్ని పరుగులు రాలేదు.... ఓ రకంగా జడేజా గాయమే మమ్మల్ని ఓడించింది...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?