ఆస్ట్రేలియాకి పయనమైన రోహిత్ శర్మ... మూడో టెస్టు కోసం క్వారంటైన్ నుంచే...
First Published Dec 15, 2020, 4:31 PM IST
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ఆసీస్‌తో టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లాడు. ఐపీఎల్‌లో ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్‌లో గాయపడిన రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి, ఆ మ్యాచ్‌లో జరిగినంత హైడ్రామా నడిచింది. ఒకానొక దశలో రోహిత్ టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నట్టే అని వార్తలు వచ్చినా, ఎట్టకేలకు శర్మగారి అబ్బాయి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కాడు...

అక్టోబర్ 18న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్‌లో గాయపడ్డాడు రోహిత్ శర్మ... ఈ సంఘటన జరిగి దాదాపు రెండు నెలలు అవుతున్న రోహిత్ గాయం మిస్టరీ మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు...

ఐపీఎల్‌లో గాయపడిన వృద్ధిమాన్ సాహా లాంటి క్రికెటర్లు కూడా ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం అటు నుంచి అటే... దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కితే, రోహిత్ శర్మ మాత్రం స్వదేశానికి తిరిగొచ్చాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?