హార్దిక్ పాండ్యా రికార్డు బద్దలు - విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం క్లబ్‌లోకి సూర్యకుమార్ యాదవ్
Surya Kumar Yadav: భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ లతో హైదరాబాద్ స్టేడియంలో పరుగుల వరద పారించారు. వీరి ధనాధన్ బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది భారత్. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ ప్రత్యేక ఘనత సాధించాడు.
Surya Kumar Yadav
Surya Kumar Yadav: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో మూడవ - చివరి మ్యాచ్‌లో భారత్ 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ప్లేయర్లు ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే భారత్ టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును సాధించింది.
సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యాతో పాటు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 75 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ త్వరగానే ఔట్ అయిన తర్వాత సూర్య క్రీజులోకి వచ్చాడు. 34 ఏళ్ల సూర్య కుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ శాంసన్ (111)తో కలిసి రెండో వికెట్‌కు 173 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
IND vs BAN Sanju Samson, Surya Kumar Yadav, Hyderabad,
విరాట్ కోహ్లీ - బాబర్ క్లబ్‌లోకి సూర్యకుమార్ యాదవ్
ఈ 75 పరుగుల ఇన్నింగ్స్‌తో సూర్య కుమార్ యాదవ్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో తన 2500 పరుగులను పూర్తి చేశాడు. దీంతో ప్రపంచ క్రికెట్ లో అత్యంత వేగంగా 2500 పరుగులు పూర్తి చేసిన టాప్-5 బ్యాటర్ల జాబితాలోకి చేరాడు. బాబర్ అజామ్, విరాట్ కోహ్లీ తర్వాత వేగంగా 2500 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా సూర్య నిలిచాడు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ తన 67వ మ్యాచ్‌లో 2500 పరుగుల మార్క్‌ను దాటగా, ఈ మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీ 73 మ్యాచ్‌లు ఆడాడు. కోహ్లీ కంటే ఒక్క మ్యాచ్ ఎక్కువ ఆడి సూర్య ఈ ఘనత సాధించాడు. టీ20ల్లో వేగంగా 2500కి పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. టీమిండియా తరఫున 100వ టీ20లో 2500 పరుగుల మార్కును అధిగమించాడు.
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో వేగంగా 2500 పరుగులు చేసిన ఆటగాళ్లు
బాబర్ ఆజం (పాకిస్తాన్) – 67 మ్యాచ్‌లు
విరాట్ కోహ్లీ (భారత్) – 73 మ్యాచ్‌లు
సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 74 మ్యాచ్‌లు
మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) – 76 మ్యాచ్‌లు
ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) – 78 మ్యాచ్‌లు
హార్దిక్ పాండ్యాను అధిగమించిన సూర్య కుమార్ యాదవ్
హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి, టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు అత్యంత విజయవంతమైన నాల్గవ కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. 16 టీ20 ఇంటర్నేషనల్స్‌లో హార్దిక్ పాండ్యా 10 విజయాల రికార్డును సూర్య బద్దలు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ ఇప్పటి వరకు ఆడిన 13 టీ20ల్లో 11 విజయాలు సాధించింది. సూర్య కెప్టెన్సీలో భారత్ ఆస్ట్రేలియాపై 4 మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికాపై ఒకటి, శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై 3-3తో విజయం సాధించింది. ఇందులో శ్రీలంకపై సూపర్ ఓవర్‌లో విజయం కూడా ఉంది.
టీ20 ఇంటర్నేషనల్‌లో భారత కెప్టెన్‌గా అత్యధిక విజయాలు వీరివే
రోహిత్ శర్మ - 49
మహేంద్ర సింగ్ ధోని - 42
విరాట్ కోహ్లీ - 32
సూర్యకుమార్ యాదవ్ - 11
హార్దిక్ పాండ్యా - 10
అంతర్జాతీయ క్రికెట్ లో సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల రికార్డులు ఏమిటి?
అంతర్జాతీయ టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో సూర్య కుమార్ యాదవ్ నికోలస్ పూరన్‌తో సమానంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. 74 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 144 సిక్సర్లు బాదాడు. వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ కూడా ఇప్పటివరకు 144 సిక్సర్లు బాదాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు భారత స్టార్ ప్లేయర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉంది.
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదింది వీరే
రోహిత్ శర్మ (భారతదేశం) – 205 సిక్సర్లు
మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్) – 173
సూర్యకుమార్ యాదవ్ (భారతదేశం) – 144
నికోలస్ పూరన్ (వెస్టిండీస్) – 144
జోస్ బట్లర్ (ఇంగ్లండ్) – 137