MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !

Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !

Team India: వరల్డ్ కప్ ఫ్లాప్ షో తర్వాత ఏషియన్ గేమ్స్ 2026 కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా గోల్డ్ మెడల్ కాపాడుకునేందుకు బరిలోకి దిగుతోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 30 2026, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏషియన్ గేమ్స్ 2026: సరికొత్త మిషన్‌కు టీమిండియా రెడీ
Image Credit : X/BCCIWomen

ఏషియన్ గేమ్స్ 2026: సరికొత్త మిషన్‌కు టీమిండియా రెడీ

టీ20 ప్రపంచకప్ 2026లో సెమీఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించిన భారత మహిళల క్రికెట్ జట్టు ముందర ఇప్పుడు ఒక సరికొత్త మిషన్ ఉంది. జపాన్‌లోని ఐచి-నాగోయా లలో జరగబోయే ఏషియన్ గేమ్స్ 2026 కోసం భారత మహిళల క్రికెట్ జట్టును అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా టోర్నీ కోసం సెలెక్టర్లు మొత్తం 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేశారు. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

గత ఏషియన్ గేమ్స్ (2023) చైనాలోని హాంగ్‌జౌలో జరిగాయి. ఆ టోర్నీ ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. ఈసారి ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పుడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఆమె సేనపై తమ బంగారు పతకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యువత, అనుభవాల పర్ఫెక్ట్ కాంబినేషన్ తో టీమిండియా
Image Credit : X/BCCIWomen

యువత, అనుభవాల పర్ఫెక్ట్ కాంబినేషన్ తో టీమిండియా

మొత్తం 8 జట్ల మధ్య జరిగే ఈ ఉత్కంఠభరిత పోరు టీ20 ఫార్మాట్‌లో సాగనుంది. ఈ టోర్నీ కోసం సెలెక్టర్లు సీనియర్ ఆటగాళ్లతో పాటు, డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించిన పలువురు యువ ముఖాలకు కూడా జట్టులో చోటు కల్పించారు. జట్టు మెయిన్ బ్యాటింగ్ లైనప్‌లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఉన్నారు.

స్పిన్, ఆల్‌రౌండ్ బాధ్యతలను దీప్తి శర్మ, రాధా యాదవ్ చూసుకోనున్నారు. పేస్ బౌలింగ్ విభాగాన్ని రేణుకా ఠాకూర్ లీడ్ చేయనుంది. వీటితో పాటు డొమెస్టిక్ సర్క్యూట్‌లో అదరగొట్టిన జి. కమలిని, భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మలకు ఈ మెగా టోర్నీలో తమను తాము నిరూపించుకోవడానికి గోల్డెన్ ఛాన్స్ దక్కింది.

Related Articles

Related image1
FIFA World Cup: లాస్ట్ మినిట్ ట్విస్ట్ అంటే ఇదే బాస్.. డచ్ ను ముంచేసిన మొరాకో, ప్రీక్వార్టర్స్‌లోకి మాస్ ఎంట్రీ
Related image2
Ghost Village Mystery: ఒక్క రాత్రిలో మాయమైన గ్రామం.. ఘోస్ట్ విలేజ్ కుల్ధారా మిస్టరీ ఇదే !
35
శ్రేయాంక పాటిల్ ఎంపికపై సస్పెన్స్
Image Credit : X/BCCIWomen

శ్రేయాంక పాటిల్ ఎంపికపై సస్పెన్స్

స్పిన్ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌ను 15 మంది సభ్యుల ప్రధాన జట్టులోకి తీసుకున్నప్పటికీ, ఆమె ఎంపిక పూర్తిగా ఫిట్‌నెస్ క్లియరెన్స్‌ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్న శ్రేయాంకకు, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తేనే ఆమె జపాన్‌కు విమానం ఎక్కనుంది.

45
మ్యాచ్‌లు ఎప్పుడు? ఎక్కడ జరుగుతాయి?
Image Credit : X/BCCIWomen

మ్యాచ్‌లు ఎప్పుడు? ఎక్కడ జరుగుతాయి?

జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరిగే ఈ ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ యాక్షన్ 2026 సెప్టెంబర్ 17 నుండి సెప్టెంబర్ 22 వరకు సాగనుంది. ఈ షార్ట్ అండ్ హై-వోల్టేజ్ టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లు నాగోయాలోని అందమైన కొరోజి స్పోర్ట్స్ పార్క్‌లో జరగనున్నాయి. వరల్డ్ కప్ ఫ్లాప్ షోను మర్చిపోయి, అభిమానులకు మళ్లీ జోష్ ఇవ్వడానికి ఈ టోర్నీ టీమిండియాకు చాలా ముఖ్యం.

55
ఏషియన్ గేమ్స్ 2026 కోసం పూర్తి భారత మహిళల జట్టు:
Image Credit : X/BCCIWomen

ఏషియన్ గేమ్స్ 2026 కోసం పూర్తి భారత మహిళల జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
మహిళల క్రికెట్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Recommended image2
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Recommended image3
సెమీఫైన‌ల్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా.. భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఓట‌మికి కార‌ణం ఏంటో తెలుసా.?
Related Stories
Recommended image1
FIFA World Cup: లాస్ట్ మినిట్ ట్విస్ట్ అంటే ఇదే బాస్.. డచ్ ను ముంచేసిన మొరాకో, ప్రీక్వార్టర్స్‌లోకి మాస్ ఎంట్రీ
Recommended image2
Ghost Village Mystery: ఒక్క రాత్రిలో మాయమైన గ్రామం.. ఘోస్ట్ విలేజ్ కుల్ధారా మిస్టరీ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved