విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య గొడవలు నిజమే... సాక్ష్యం ఇదిగో...
వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ ద్వారా టీమిండియా వైట్ బాల్ కెప్టెన్‌గా నయా ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నాడు రోహిత్ శర్మ. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేవలం ఓ బ్యాటర్‌గా రోహిత్ టీమ్‌లో ఆడబోతున్నాడు...

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది భారత క్రికెట్ బోర్డు. ఈ నిర్ణయంపై విరాట్, బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు..
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై పెద్ద రచ్చే జరిగింది. విరాట్‌ని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోరామని, అయితే అతను వినలేదని... వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతోనే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని కామెంట్ చేశాడు సౌరవ్ గంగూలీ...
అయితే సౌతాఫ్రికా టూర్‌కి ముందు ఇచ్చిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో విరాట్ కోహ్లీ, గంగూలీ కామెంట్లను కొట్టి పారేశాడు. తనను ఎవ్వరూ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోరలేదని, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టుగా గంటన్నర ముందు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు...
విరాట్ కోహ్లీ చేసిన కామెంట్లతో సోషల్ మీడియాలో పెను దుమారమే రేగింది. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉంటూ, రాజకీయాలు చేస్తున్న సౌరవ్ గంగూలీని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు విరాట్ ఫ్యాన్స్...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత కేవలం టీ20 ఫార్మాట్ పగ్గాలు తీసుకోవడానికి రోహిత్ శర్మ ఒప్పుకోలేదని, వన్డే కెప్టెన్సీ కూడా కావాలని పట్టుబట్టాడని కూడా వార్తలు వచ్చాయి...
ఈ ప్రచారాలన్నీ వుట్టి పుకార్లేనని కొట్టిపారేసినా... సౌతాఫ్రికా టూర్ ముగిసిన తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేశాడు విరాట్ కోహ్లీ...
ఈ వార్తలన్నీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య సంబంధాలు సరిగా లేవనే వార్తను ప్రచారం చేశాయి. అయితే విరాట్, రోహిత్‌తో తనకెలాంటి విభేదాలు లేవని కొట్టిపారేశాడు...
అయితే తాజాగా బీసీసీఐ పోస్టు చేసిన ఓ ఫోటో చూస్తుంటే మాత్రం ఈ ఇద్దరి మధ్య నిజంగానే గొడవలు ఉన్నట్టున్నాయని తేల్చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, ప్రాక్టీస్ సెషన్స్ ముందు టీమ్ సభ్యులతో చర్చిస్తుంటే, విరాట్ కోహ్లీ మాత్రం అతని మాటలు పట్టించుకోకుండా ఏటో చూస్తూ నిల్చున్నాడు...
చూస్తుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్టు కనబడుతోందని, ఇది టీమిండియాకి ఏ మాత్రం మంచిది కాదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...
పనిలో పనిగా ‘రోహిత్ మా కెప్టెన్ కాదు’ (Rohit is not my Captain) హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ వీరాభిమానులు...