MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs SA: ఐడెన్ మార్క్‌రమ్ సెంచ‌రీ.. భార‌త బౌల‌ర్ల దెబ్బ‌కు స‌ఫారీలు విల‌విల

IND vs SA: ఐడెన్ మార్క్‌రమ్ సెంచ‌రీ.. భార‌త బౌల‌ర్ల దెబ్బ‌కు స‌ఫారీలు విల‌విల

India vs South Africa Test: ఇండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో, ఈ సిరీస్ చివ‌రి టెస్టులో తొలి రోజు ఫాస్ట్ బౌలర్ల హ‌వా కొన‌సాగుతున్న పిచ్ పై ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ ఐడెన్ మార్క్‌రమ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. మిగ‌తా బ్యాట‌ర్స్ వ‌రుస‌గా ఫెవిలియ‌న్ కు క్యూక‌ట్టారు. బుమ్రా 6 వికెట్లు తీశాడు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 04 2024, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Jasprit Bumrah Aiden Markram

Jasprit Bumrah-Aiden Markram

IND vs SA Test: భార‌త-సౌతాఫ్రికా రెండో టెస్టు సెంకండ్ ఇన్నింగ్స్ లో ప్రొటీస్ జ‌ట్టు ప్లేయ‌ర్లు వ‌రుస‌గా ఫెవిలియ‌న్ కు క్యూ క‌ట్ట‌గా.. ఐడెన్ మార్క్‌రమ్ మాత్రం త‌న‌దైన స్టైల్లో బ్యాటింగ్ లో రాణించి సెంచ‌రీ చేశాడు. 103 బంతులు ఎదుర్కొన్న ఐడెన్ మార్క్‌రమ్ 106 ప‌రుగుల‌తో అద‌ర‌గొట్టాడు. అత‌ని ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, 2 సిక్స‌ర్లు ఉన్నాయి. 106 ప‌రుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.  ఐడెన్ మార్క్‌రమ్ త‌ప్ప సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో మిగ‌తా ప్లేయ‌ర్లు ఎవ‌రూ పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు. దీంతో కేప్ టౌన్ టెస్టులో భారత్ ముందు 79 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఉంచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

రెండో రోజు ఆటను 62/3తో ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు లంచ్ సమయానికి 176 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీయగా, ముఖేష్ కుమార్ 2, సిరాజ్, ప్ర‌సిద్ధ్ లు ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో ఐడెన్ మార్క్‌రమ్ 103 బంతుల్లో 106 పరుగులు చేశాడు. మిగ‌తా బ్యాట‌ర్స్ రాణించ‌లేక‌పోయారు.  త‌న టెస్టు కెరీర్ లో చివ‌రి మ్యాచ్ అడుతున్న డీన్ ఎల్గ‌ర్ 12 ప‌రుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ద‌క్షిణాఫ్రికా 176 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. భార‌త్ ముందు 79 ప‌రుగుల టార్గెట్ ను ఉంచింది. 
 

33

అంత‌కుముందు తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ చెరో 2 వికెట్లు తీశారు. భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున కగిసో రబడ, నాంద్రే బర్గర్, లుంగీ ఎంగిడీ తలో 3 వికెట్లు తీశారు. ఎంగిడీ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రోహిత్ శర్మ
భారత జాతీయ క్రికెట్ జట్టు
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved