- Home
- Sports
- Cricket
- అందరి ఫోకస్ అతనిపైనే... రిషబ్ పంత్ లక్ మామూలుగా లేదుగా! అప్పుడు ఐపీఎల్‌లో, ఇప్పుడు...
అందరి ఫోకస్ అతనిపైనే... రిషబ్ పంత్ లక్ మామూలుగా లేదుగా! అప్పుడు ఐపీఎల్‌లో, ఇప్పుడు...
అనుకోకుండా ఐపీఎల్ కెప్టెన్ అవ్వడమే లక్ అనుకుంటే, అనుకోకుండానే టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకోబోతున్నాడు రిషబ్ పంత్... ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అతనే హైలైట్ కాబోతున్నాడు. విరాట్ కోహ్లీ అగ్రెసివ్ కెప్టెన్సీ స్కిల్స్, ఎమ్మెస్ ధోనీ స్టైల్, రోహిత్ శర్మ యాటిట్యూడ్ కలగలిసిన రిషబ్ పంత్... టీమిండియా కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది..

ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత జరిగిన ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్ పరాజయం.. రిషబ్ పంత్ కెరీర్‌ని అమాంతం మార్చేసింది. ఆడిలైడ్ టెస్టులో సాహా ఫెయిల్ కావడంతో టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకున్నాడు.
బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులతో అజేయంగా నిలిచి, భారత జట్టుకి చారిత్రక విజయాన్ని అందించి... ఓవర్‌నైట్ స్టార్‌గా అవతరించాడు. అప్పటి నుంచి రిషబ్ పంత్ కెరీర్ పీక్ స్టేజీలో ముందుకు దూసుకుపోతోంది...
అయితే రిషబ్ పంత్ కెప్టెన్ అవుతాడని ఎవ్వరూ, ఎప్పుడూ ఊహించింది లేదు. ఐపీఎల్ 2021 సీజన్‌కి శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో అనుకోకుండా రిషబ్ పంత్‌కి ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్సీ దక్కింది. తాత్కాలిక సారథిగా సీన్‌లోకి వచ్చిన రిషబ్ పంత్, తన కెప్టెన్సీ స్కిల్స్‌తో అయ్యర్‌కే ఎసరు పెట్టారు...
ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ సమయానికి శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా కోలుకుని, టీమ్‌కి అందుబాటులోకి వచ్చినా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది ఢిల్లీ క్యాపిటల్స్... టీమిండియా కెప్టెన్సీ కూడా ఇలా లక్కీగానే పంత్ దగ్గరికి వచ్చింది...
ఢిల్లీ క్యాపిటల్స్‌కి రెండు సీజన్లుగా కెప్టెన్సీ చేస్తున్నా భారత జట్టు ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో రిషబ్ పంత్ లేడు. అయితే రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా రెస్ట్ తీసుకోవడంతో సౌతాఫ్రికా సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు రిషబ్ పంత్...
సిరీస్ ఆరంభానికి ముందు కెఎల్ రాహుల్ గాయంతో తప్పుకోవడంతో రిషబ్ పంత్... టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోబోతున్నాడు... అతి పిన్న వయసులో టీ20 కెప్టెన్సీ చేపట్టబోతున్న రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్...
ఇంతకుముందు సురేష్ రైనా 23 ఏళ్ల 197 రోజుల వయసులో టీమిండియా టీ20 కెప్టెన్సీ చేపట్టగా, రిషబ్ పంత్ 24 ఏళ్ల 249 రోజుల వయసులో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు.
ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని మొదటిసారి ఫైనల్‌కి చేర్చిన శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా... జట్టులో ఉన్నా వారిని కాదని రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ అప్పగించారంటే అతను ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు...