IND vs SA 2nd Test: కేప్‌టౌన్‌లో సెంచరీలు కొట్టింది ఆ నలుగురు మాత్రమే.. !
IND vs SA 2nd Test: కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. అయితే, ఈ గ్రౌండ్ భారత్ రికార్డులు అంతగొప్పగా ఏమీ లేవు. ఇప్పటివరకు నలుగురు భారత బ్యాటర్స్ మాత్రమే ఇక్కడ సెంచరీలు చేయగలిగారు.
Rishabh Pant, Sachin Tendulkar
India vs South Africa 2nd Test: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. సెంచూరియన్ లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే, కేప్ టౌన్ లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది.
Capetown Cricket Ground
కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ గ్రౌండ్ లో భారత్ అసలైన పరీక్షను ఎదుర్కొంనుంది. ఇప్పటివరకు ఈ గ్రౌండ్ భారత్ ఒక్క విజయం కూడా సాధించలేదు. గత గణాంకాలు గమనిస్తే దిగ్గజ ప్లేయర్లు సైతం ఈ గ్రౌండ్ లో బ్యాంటింగ్ చేయడానికి చాలా కష్టపడ్డారు. కేవలం నలుగురు భారత బ్యాటర్స్ మాత్రమే ఇక్కడ సెంచరీలు చేయగలిగారు. ప్రస్తుత భారత జట్టులో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఇదివరకు ఇక్కడ సెంచరీలు చేసిన భారత బ్యాటర్స్ లో...
Image credit: PTI
సచిన్ టెండూల్కర్
కేప్ టౌన్‌లో టెస్టు మ్యాచ్ ఆడుతూ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ (169 పరుగులు). ఈ మైదానంలో భారత్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా అతనే. ఇక్కడ మాస్టర్ బ్లాస్టర్ 2 సెంచరీలు సాధించాడు. దక్షిణాఫ్రికాపై మెరుగైన బ్యాటింగ్ రికార్డులు సైతం టెండూల్కర్ పేరు మీదనే ఉన్నాయి.
ముహమ్మద్ అజహరుద్దీన్
1997లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేశారు. మొదట సచిన్ టెండూల్కర్ చేయగా, రెండవ ప్లేయర్ మహ్మద్ అజారుద్దీన్. ఈ మైదానంలో అజారుద్దీన్ (115 పరుగులు) భారత్ తరఫున రెండో టెస్టు సెంచరీ సాధించగలిగాడు.
వసీం జాఫర్
2007లో భారత్ తరఫున ఆడుతున్న సమయంలో వెటరన్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ వసీం జాఫర్ సెంచరీ చేశాడు. 244 బంతులు ఎదుర్కొని 116 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
రిషబ్ పంత్
ఘోర కారు ప్రమాదంతో టీమ్ ఇండియాకు దూరమైన వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కూడా ఈ మైదానంలో సెంచరీ సాధించాడు. 2022లో అతను 100 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.