MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇషాంత్ శర్మ కెరీర్ ఇక ముగిసినట్టేనా... మూడో టెస్టులో ఉమేశ్ యాదవ్ పర్ఫామెన్స్‌తో...

ఇషాంత్ శర్మ కెరీర్ ఇక ముగిసినట్టేనా... మూడో టెస్టులో ఉమేశ్ యాదవ్ పర్ఫామెన్స్‌తో...

సౌతాఫ్రికా టూర్‌లో ఇషాంత్ శర్మకు ప్లేస్ ఉండకపోవచ్చని అనుకున్నారు క్రికెట్ విశ్లేషకులు. అయితే 33 ఏళ్ల ఇషాంత్ శర్మకు సఫారీ టూర్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కడంతో ఇదే అతనికి ఆఖరి సిరీస్ కావచ్చని కూడా వార్తలు వినిపించాయి...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 13 2022, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

గత ఏడాది కాలంగా గాయాలతో బాధపడుతున్న ఇషాంత్ శర్మ, న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

కాన్పూర్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ తీయలేకపోయిన ఇషాంత్ శర్మ, గాయం కారణంగా రెండో టెస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

312

భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ తర్వాత 100కి పైగా టెస్టులు ఆడిన రెండో భారత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ఇషాంత్ శర్మ, ప్రస్తుతం 105 టెస్టుల్లో 311 వికెట్లు పడగట్టాడు...

412

టీమిండియా తరుపున 300+ టెస్టు వికెట్లు తీసిన ఆరో బౌలర్‌ ఇషాంత్ శర్మ. ఇంతకుముందు అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు...

512

‘మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా మూడో టెస్టుకి దూరమైనప్పుడు అతని స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు చోటు దక్కుతుందని అనుకున్నా... కానీ ఉమేశ్ యాదవ్‌కి చోటు దక్కింది...

612

ఉమేశ్ యాదవ్ బ్రిలియెంట్ బౌలర్. అయితే ఇషాంత్ శర్మ ఇప్పటికే 100కి పైగా టెస్టులు ఆడాడు. అంత అనుభవం ఉన్న బౌలర్‌కి ఐదుగురు ఫాస్ట్ బౌలర్లలోనూ చోటు దక్కకపోవడం దారుణం...

712

కెరీర్ చివరి దశలో ఉన్న ఇషాంత్ శర్మకు ఇలాంటి పరిణామాలు పెద్దగా నచ్చకపోవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా..

812

‘ఇషాంత్ శర్మకి తుది జట్టులో చోటు దక్కి ఉంటే బాగుండేది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అందరూ పరుగులు సమర్పించారు, బుమ్రాతో సహా...

912

అలాంటి సమయంలో సౌతాఫ్రికా బ్యాటర్ల సహనానికి పరీక్ష పెట్టే అనుభవం ఇషాంత్ శర్మ సొంతం... అందుకే అతనికి చోటు ఇవ్వాల్సింది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్...

1012

‘ఐదుగురు ఫాస్ట్ బౌలర్లకు చోటు దక్కిన తర్వాత 100 టెస్టులకు పైగా అనుభవం ఉన్న  ఇషాంత్ శర్మ తుదిజట్టులోకి రాకపోవడం అతన్ని అవమానించడమే...

1112

అయితే అతనికి ఎందుకు చోటు ఇవ్వలేదో క్లియర్‌గా చెప్పాలి. నూరు టెస్టుల అనుభవం ఉన్న సీనియర్‌కి గౌరవం ఇవ్వాలి... సౌతాఫ్రికాలో లెఫ్ట్ హ్యాండర్లు ఉండడం వల్లే ఇషాంత్‌కి చోటు దక్కలేదనుకుంటా...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పోలాక్...

1212

వచ్చే నెలలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌‌‌లో ఆడిన తర్వాత ఇషాంత్ శర్మ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved