MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మరోసారి సౌతాఫ్రికా తొండాట... మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ అసంతృప్తి...

మరోసారి సౌతాఫ్రికా తొండాట... మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ అసంతృప్తి...

30 ఏళ్లుగా సౌతాఫ్రికా గడ్డ మీద టెస్టు సిరీస్ గెలవలేకపోయింది భారత జట్టు. ఈ సారి ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవడమే లక్ష్యంగా సఫారీ గడ్డపై అడుగుపెట్టింది. అయితే సిరీస్‌ను కాపాడుకోవడానికి సౌతాఫ్రికా దొంగదారి పడుతోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 13 2022, 09:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 198 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 13 పరుగుల ఆధిక్యంతో కలిసి సౌతాఫ్రికా ముందు 212 పరుగుల టార్గెట్‌ని పెట్టింది...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
213

22 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్‌ను మహ్మద్ షమీ అవుట్ చేయడంతో 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా...

313

అదే ఓవర్‌లో డీన్ ఎల్గర్ ఇచ్చిన అందుకోవడంలో విఫలమయ్యాడు పూజారా. లేకపోతే వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయేది సఫారీ జట్టు...

413

డీన్ ఎల్గర్, కీగన్ పీటర్సన్ కలిసి రెండో వికెట్‌కి 60+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, జట్టును పటిష్ట స్థితికి చేరుస్తున్నారు...

513

ఈ దశలో జట్టు స్కోరు 60 పరుగులు ఉన్నప్పుడు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు ప్రకటించాడు అంపైర్...

613

అయితే వెంటనే డీన్ ఎల్గర్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టుగా చూపించింది...

713

బేసిక్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ఎవ్వరికైనా ఆ బంతి వికెట్లను తాకుతుందని తెలుస్తుంది. కనీసం అంపైర్ కాల్స్‌గా అయినా అవుతుందని అర్థం అవుతుంది...

813

అలాంటిది థర్డ్ అంపైర్, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని తప్పుగా వాడి... వికెట్ పడకుండా కాపాడినట్టు స్పష్టంగా అర్థమవుతోందని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు...

913

విరాట్ కోహ్లీతో పాటు అవుట్‌గా చెప్పిన అంపైర్ ఎరాస్మస్ కూడా ‘దిస్ ఇజ్ ఇంపాజిబుల్’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం...

1013

రవిచంద్రన్ అశ్విన్, స్టంప్ మైక్ దగ్గరికి వచ్చి ‘సూపర్ స్టోర్‌లో గెలవాలనుకుంటే కొంచెం మంచి మార్గాలు వెతుక్కుంటే బెటర్’ అంటూ థర్డ్ అంపైర్‌ని కామెంట్ చేశాడు...

1113

భారత సారథి విరాట్ కోహ్లీ కూడా... ‘ప్రత్యర్థిపై కాకుండా మీ టీమ్‌ని పటిష్టంగా చేయడంపై ఫోకస్ పెట్టండి... ఎప్పుడూ పక్కనొళ్లని పట్టుకోవాలని చూస్తారు...’ అంటూ స్టంప్ మైక్‌లో చెప్పాడు...

1213

‘వికెట్లు కావాలంటే కేవలం క్యాచులు పట్టుకోవాలి, లేదా వికెట్లు తీయాలి... మరోదారి లేదు...’ అంటూ గట్టిగానే చెప్పాడు విరాట్ కోహ్లీ...

1313

కెఎల్ రాహుల్ కూడా ‘మా పదకొండు మందిని ఓడించడానికి దేశమంతా కలిసి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు...
 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026: ముంబైకి కేకేఆర్ షాక్.. ప్లేఆఫ్స్ రేసులోకి కోల్‌కతా.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
Recommended image2
Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Recommended image3
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved