MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs PAK: భారత్ vs పాకిస్థాన్.. గెలుపు ఎవరిది? హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే !

IND vs PAK: భారత్ vs పాకిస్థాన్.. గెలుపు ఎవరిది? హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే !

IND vs PAK : ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఇరు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డులు, గత ప్రదర్శనల ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 14 2026, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీ20 వరల్డ్ కప్ లో భారత్ vs పాక్ పోరు
Image Credit : X/ICC

టీ20 వరల్డ్ కప్ లో భారత్ vs పాక్ పోరు

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఒక రకమైన ఉత్కంఠ. మహిళల క్రికెట్‌లో కూడా ఈ దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇరు జట్లు మైదానంలోకి దిగుతున్నాయంటే అభిమానులకు పండగే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కేవలం ఐసీసీ టోర్నీల్లోనే పోరు
Image Credit : Getty

కేవలం ఐసీసీ టోర్నీల్లోనే పోరు

పురుషుల క్రికెట్ మాదిరిగానే, మహిళల క్రికెట్‌లో కూడా భారత్, పాకిస్థాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడవు. కేవలం ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్, ఇతర బహుళ దేశాల టోర్నీలలోనే వీరు ముఖాముఖి తలపడతారు. ఈ కారణంగానే గత కొన్నేళ్లుగా ఇరు జట్లు కేవలం 16 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మాత్రమే ఒకరినొకరు ఎదుర్కొన్నాయి. వీరి మధ్య మొదటి టీ20 మ్యాచ్ 2009లో జరిగింది.

Related Articles

Related image1
Rohit Sharma: రోహిత్ రన్ అవుట్ హైడ్రామా.. డ్రెస్సింగ్ రూమ్‌లో అసలు ఏం జరిగింది? గిల్ ఏం చెప్పాడంటే?
Related image2
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్‌లో వినీషియస్ జూనియర్ మ్యాజిక్ గోల్.. ట్రావిస్ స్కాట్ క్రేజీ సెలబ్రేషన్స్ వైరల్ !
35
టీ20ల్లో భారత్ ఆధిపత్యం
Image Credit : X/BCCIWomen

టీ20ల్లో భారత్ ఆధిపత్యం

హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే, పాకిస్థాన్‌పై భారత్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు జరిగిన 16 టీ20I మ్యాచ్‌లలో భారత్ 13 సార్లు విజయం సాధించగా, పాకిస్థాన్ కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. 2009 జూన్ 13న టాంటన్ లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి, తమ విజయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది.

45
వరల్డ్ కప్‌లో గెలుపు లెక్కలు ఇవే
Image Credit : X/ICC

వరల్డ్ కప్‌లో గెలుపు లెక్కలు ఇవే

టీ20 వరల్డ్ కప్ చరిత్రను చూస్తే, ఇరు జట్లు ఇప్పటివరకు ఎనిమిది సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ ఆరు మ్యాచ్‌లలో గెలవగా, పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. 2012, 2016 వరల్డ్ కప్‌లలో మాత్రమే పాకిస్థాన్ భారత్‌ను ఓడించగలిగింది. మిగిలిన 2009, 2010, 2014, 2018, 2023, 2024 ఎడిషన్లలో పాకిస్థాన్‌ను భారత్ మట్టికరిపించింది.

55
పాకిస్థాన్ కు మళ్లీ షాక్ తప్పదా?
Image Credit : X/ICC

పాకిస్థాన్ కు మళ్లీ షాక్ తప్పదా?

పాకిస్థాన్ టీమ్ భారత్‌పై టీ20Iలో తమ మొదటి విజయాన్ని 2012 అక్టోబర్‌లో గాలేలో సాధించింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ కేవలం ఒక్క పరుగు తేడాతో గెలిచి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2016లో మరోసారి భారత్‌పై విజయం సాధించింది. కానీ, ఆ తర్వాత భారత్ వరుస విజయాలతో పాకిస్థాన్‌ను దెబ్బతీస్తూ వస్తోంది.

హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు, తన పాత రికార్డులను కొనసాగిస్తూ మరో విజయాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతుంటే, పాకిస్థాన్ జట్టు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
మహిళల క్రికెట్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rohit Sharma: రోహిత్ రన్ అవుట్ హైడ్రామా.. డ్రెస్సింగ్ రూమ్‌లో అసలు ఏం జరిగింది? గిల్ ఏం చెప్పాడంటే?
Recommended image2
IND vs AFG : ఆఫ్ఘనిస్తాన్‌పై గిల్ ఊచకోత.. కేఎల్ రాహుల్ మాస్ రాంపేజ్
Recommended image3
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Related Stories
Recommended image1
Rohit Sharma: రోహిత్ రన్ అవుట్ హైడ్రామా.. డ్రెస్సింగ్ రూమ్‌లో అసలు ఏం జరిగింది? గిల్ ఏం చెప్పాడంటే?
Recommended image2
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్‌లో వినీషియస్ జూనియర్ మ్యాజిక్ గోల్.. ట్రావిస్ స్కాట్ క్రేజీ సెలబ్రేషన్స్ వైరల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved