- Home
- Sports
- Cricket
- Champions Trophy: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లో గెలిచేది ఎవరు? ఏంది మామ ఈ బాబా ఇలా చెప్పేశాడు !
Champions Trophy: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లో గెలిచేది ఎవరు? ఏంది మామ ఈ బాబా ఇలా చెప్పేశాడు !
India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ మ్యాచ్ భారత్ vs పాకిస్తాన్ కు సర్వం సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచేది ఎవరో చెప్పారు మహాకుంభమేళా ద్వారా వైరల్ అయిన ఐఐటీ బాబా.

India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై సూపర్ విక్టరీ అందుకుంది. రెండో మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ హై వోల్టేజీ మ్యాచ్ కోసం క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ లో గెలిచేది ఎవరనే విషయంపై మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
ind pak
ఇప్పుడు మహాకుంభమేళా ద్వారా వైరల్ అయిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ కూడా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో గెలిచేది ఎవరో చెప్పారు. ఐఐటీ బాబా ప్రకారం ఇండియా పాక్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? అని ఒక ఇంటర్వ్యూలో అడిగారు. దీనికి సమాధానంగా ఐఐటీ బాబా మాట్లాడుతూ, చాలాసార్లు భారత్ పాకిస్తాన్ మ్యాచ్‌లో భారతీయులకు సంతోషం కలిగింది. కానీ ఈసారి ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుంది. భారత్‌కు నిరాశ ఎదురవుతుందని ఐఐటీ బాబా షాకింగ్ అంచనా వేశారు. "నేను కచ్చితంగా చెబుతున్నాను. ఈసారి భారత్ గెలవదు. ఇది సాధ్యం కాదు" అని ఐఐటీ బాబా చెప్పారు.
Image credit: Getty
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఇప్పటికీ క్రీడా ప్రపంచంలో హీటును పెంచింది. ఇలాంటి సమయంలో ఐఐటీ బాబా చెప్పిన అంచనా ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఎక్కువ తెలుసుకుంటే ప్రమాదమని కామెంట్ చేశారు. ఐఐటీ బాబా కర్మను నమ్ముతారు. మేము శర్మను నమ్ముతామంటూ కామెంట్ చేస్తున్నారు.
Agar IIT Baba ka tukka laag gya tou kuch log inhe apna bagwan bna lenge 😂 pic.twitter.com/sZPzRxsICe
— Mr. Neeraj (@NeerajS00964849) February 21, 2025
India vs Pakistan match
కాగా, భారత్, పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ ఫిబ్రవరి 23, 2025న మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 టీమ్ లు ఆడుతున్నాయి. భారత్ తన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచింది. పాకిస్తాన్ తన మొదటి మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడింది. కానీ ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో భారత్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే టోర్నీలో ఉంటుంది. లేకుంటే ఇంటిదారి పడుతుంది. ఇక టీమిండియా పాక్ పై గెలిస్తే సెమీస్ చేరుతుంది.