MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఎన్ని అవకాశాలిచ్చినా అజింకా రహానే సెట్ కాడు... ఇన్ని టెస్టు మ్యాచులు ఆడి ఏం లాభం...

ఎన్ని అవకాశాలిచ్చినా అజింకా రహానే సెట్ కాడు... ఇన్ని టెస్టు మ్యాచులు ఆడి ఏం లాభం...

ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్ టెస్టు ఘోర పరాజయం తర్వాత టీమిండియాను అద్భుతంగా నడిపించి, క్రికెట్ ఫ్యాన్స్‌ నోరెళ్లబెట్టుకునేలా చేశాడు అజింకా రహానే. అయితే అది జరిగి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాకముందే జట్టులో రహానే ప్లేస్‌పై ట్రోల్స్ వినిపిస్తున్నాయి...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 23 2021, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ఆడిలైడ్ టెస్టులో విరాట్ కోహ్లీ రనౌట్ కావడానికి కారణమైన అజింకా రహానే... మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేసి, ఆ మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. మెల్‌బోర్న్ టెస్టు విజయం తర్వాత టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో ఆసీస్ గడ్డపై అదరగొట్టింది...

213

సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారా ఇన్నింగ్స్‌ల తర్వాత హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ 40 ఓవర్లకు పైగా క్రీజులో పాతుకుపోయి, భారత జట్టుకి చారిత్రాత్మక డ్రాని అందించారు...

313

ఇక ఆస్ట్రేలియా అడ్డా అయిన గబ్బాలో రహానే టీమ్, ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. బ్రిస్భన్ టెస్టులో ఆఖరి రోజున శుబ్‌మన్ గిల్, పూజారా, రిషబ్ పంత్ అదిరిపోయే బ్యాటింగ్‌తో భారత జట్టు చరిత్ర లిఖించింది...

413

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ విజయంలో అజింకా రహానే కీలక పాత్ర పోషించాడు. తాత్కాలిక కెప్టెన్ అయినా కామ్ అండ్ కూల్ యాటిట్యూడ్‌తో జట్టును నడిపించిన తీరు, క్రికెట్ ఫ్యాన్స్‌ని ఫిదా అయ్యేలా చేసింది...

513

ఒకప్పుడు భారత జట్టు తరుపున టీ20ల్లో, వన్డేల్లో కూడా ఓపెనర్‌గా వ్యవహరించిన ప్లేయర్ అజింకా రహానే. అయితే కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల కారణంగా అజింకా రహానే పరిమిత ఓవర్ల క్రికెట్‌కి దూరమై, చాలా కాలమే అయ్యింది...

613

ఇప్పుడు టెస్టుల్లో కూడా అజింకా రహానే ప్లేస్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్, అజింకా రహానేకి ఆఖరి అవకాశంగా భావిస్తున్నారు ఫ్యాన్స్...

713

శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ వంటి యంగ్ ప్లేయర్లు... టెస్టు టీమ్‌లో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నారు. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఫిక్స్ కావడంతో వీరిని మిడిల్ ఆర్డర్‌లో ఆడించాల్సిన పరిస్థితి...

813

మిడిల్ ఆర్డర్‌లో రహానే గత ఏడాది కాలంలో 19 టెస్టు ఇన్నింగ్స్‌లో కేవలం 372 పరుగులు మాత్రమే చేయగలిగాడు. యావరేజ్ 20 కంటే తక్కువ ఉంది.

913

ఛతేశ్వర్ పూజారా సెంచరీ చేయడంలో ఫెయిల్ అవుతున్నా, 20 ఇన్నింగ్స్‌ల్లో 31.11 సగటుతో 591 పరుగులు చేశాడు...

1013

2013లో టెస్టు ఎంట్రీ ఇచ్చిన అజింకా రహానే ఇప్పటికే 78 టెస్టులు ఆడి, 132 ఇన్నింగ్స్‌ల్్లో 4756 పరుగులు చేశాడు. సగటు 39.63 మాత్రమే. 70+ మ్యాచులు ఆడిన భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లలో అజింకా రహానే సగటే 40 కంటే తక్కువగా ఉంది...

1113

పూజారా 90 మ్యాచుల్లో 152 ఇన్నింగ్స్‌ల్లో 45.41 సగటుతో 6494 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే ఎమ్మెస్ ధోనీ, 90 టెస్టుల్లో 144 ఇన్నింగ్స్‌ల్లో 38.06 సగటుతో 4876 పరుగులు చేశాడు..

1213

వాస్తవానికి మెల్‌బోర్న్ టెస్టుకి ముందు అజింకా రహానే సగటు 45+గా ఉండేది. గత ఏడాది కాలంలో మూడు సార్లు డకౌట్ అయిన రహానే, చెత్త ప్రదర్శన కారణంగా యావరేజ్ కూడా తగ్గుతూ వస్తోంది...

1313

న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌, అజింకా రహానేకి ఆఖరి అవకాశమని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఈ రెండింట్లో కూడా విఫలమైతే, అతని కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారినట్టే...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
SRH vs KKR: ఆరెంజ్ ఆర్మీ ఊచకోత.. కేకేఆర్ కోటను షేక్ చేశారు !
Recommended image2
Abhishek Sharma : సిక్సర్ల కింగ్ అభిషేక్.. శర్మ మరో సెంచరీ రికార్డు కొట్టాడు !
Recommended image3
Heinrich Klaasen : కాటేరమ్మ కొడుకు క్లాసెన్ మాస్ జాతర.. కేకేఆర్ పై ఆరెంజ్ ఆర్మీ అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved