రోహిత్ శర్మ కంటే శిఖర్ ధావనే ఎక్కువ... టీమిండియాకి పార్ట్ టైమ్ కెప్టెన్‌గా మారిన రోహిత్...
ఏ ముహుర్తాన టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడో కానీ రోహిత్ శర్మకి ఏదీ కలిసి రావడం లేదు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టు వైట్ బాల్ కెప్టెన్‌గా రోహిత్‌ని ప్రకటించింది భారత జట్టు. ఆ తర్వాత రెడ్ బాల్ కెప్టెన్సీ పగ్గాలు కూడా అతనికే దక్కాయి. అయితే ఇప్పటికీ రోహిత్ టీమిండియా పార్ట్ టైమ్ కెప్టెన్‌గానే మిగిలిపోయాడు...
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో వైట్ బాల్ క్రికెట్‌గా పార్ట్ టైమ్ కెప్టెన్‌గా ఉండేవాడు రోహిత్ శర్మ. అలా విరాట్ పెళ్లి తర్వాత జరిగిన ఆసియా కప్ 2018 టోర్నీకి రోహిత్ కెప్టెన్సీ చేసి టైటిల్ కూడా గెలిచాడు. 2021 నవంబర్‌లో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రోహిత్... ఏడాదిలో 6 వన్డేలు మాత్రమే ఆడడం విశేషం...
Rohit Sharma
ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ, మళ్లీ ఇంగ్లాండ్ టూర్‌లో జరిగిన వన్డే సిరీస్‌కి సారథిగా వ్యవహరించాడు. మధ్యలో జరిగిన సిరీసులన్నీ తాత్కాలిక కెప్టెన్ల సారథ్యంలోనే జరిగాయి.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండియా- సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కి రోహిత్ శర్మను సారథిగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ తప్పించి, ఆ బాధ్యతలు రోహిత్‌కి అప్పగించింది. అయితే గాయం కారణంగా రోహిత్ శర్మ, సౌతాఫ్రికా ఫ్లైట్ కూడా ఎక్కలేకపోయాడు...
సౌతాఫ్రికా సిరీస్‌లో వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాడు. రాహుల్ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌లో 3-0 తేడాతో వైట్ వాష్ అయ్యింది టీమిండియా. ఆ తర్వాత శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ఇప్పటిదాకా 9 వన్డేలు ఆడింది టీమిండియా...
శిఖర్ ధావన్ కెప్టెన్సీలో స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ గెలిచిన భారత జట్టు, ఆ తర్వాత వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ ఏడాది టీమిండియాకి అత్యధిక మ్యాచుల్లో కెప్టెన్సీ చేసిన వన్డే కెప్టెన్ శిఖర్ ధావనే. టీమిండియా వైట్ బాల్ వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా 6 వన్డేల్లో కెప్టెన్సీ చేశాడు...
సౌతాఫ్రికా టూర్‌లో 3 వన్డేల్లో చిత్తుగా ఓడిన కెఎల్ రాహుల్,జింబాబ్వే టూర్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించి మూడు వన్డేల్లో విజయాలు అందుకున్నాడు. మొత్తంగా ఈ ఏడాది 15 వన్డేలు ఆడిన టీమిండియా, రోహిత్ కంటే ఎక్కువగా పార్ట్ టైమ్ కెప్టెన్ల కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచులు ఆడడం విశేషం...
కెప్టెన్ అయ్యాక రెండు వన్డే సిరీస్‌లకు కెప్టెన్సీ చేసిన రోహిత్.. ఐదు సిరీస్‌లకు దూరమయ్యాడు. కెప్టెన్సీ అనేది రోహిత్ శర్మకు పార్ట్ టైమ్ జాబ్‌గా మారిపోయిందని, అందుకే మరీ అవసరం అనుకుంటే తప్ప మ్యాచులు ఆడడం లేదని విమర్శలు చేస్తున్నారు అభిమానులు..