MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • India vs New Zealand: ధోని రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ

India vs New Zealand: ధోని రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ

India vs New Zealand live: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ మరోసారి శక్తివంతమైన రీతిలో గర్జించింది. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అద్భుతమైన హాఫ్ సెంచరీ కొట్టాడు. ధోని రికార్డును బ్రేక్ చేశాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 09 2025, 08:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit: Getty Images

Image Credit: Getty Images

India vs New Zealand live, ICC Champions Trophy 2025 final: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్ తో  పరుగుల వేటలో భారత్‌కు గట్టి పునాది వేశాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగింది న్యూజిలాండ్. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తో  న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. కీవీస్ టీమ్ లోని డారిల్ మిచెల్ 63 పరుగులు చేయగా, ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ 40 బంతుల్లో 53 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, రచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగుల ఇన్నింగ్స్ లు ఆడారు. 

36
Image Credit: Getty Images

Image Credit: Getty Images

252 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు మంచి శుభారంభం లభించింది. శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మలు భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. కీవీస్ బౌలింగ్ పై ఎదురుదాడికి దిగిన భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 100 పరుగుల మార్కును అందుకుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ తో న్యూజిలాండ్ బౌలింగ్ ను దంచికొడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. 

46
Rohit Sharma Out

Rohit Sharma Out

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సాధించిన హాఫ్ సెంచరీ ఛాంపియన్స్ ట్రోఫీలో వేగవంతమైన హాఫ్ సెంచరీగా రికార్డు సాధించింది. అలాగే, తన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో రోహిత్ శ‌ర్మ భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. వ‌న్డే క్రికెట్ లో  న్యూజిలాండ్ పై అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు సాధించిన ప్లేయ‌ర్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. 

56

ఇది వన్డే క్రికెట్‌లో కివీస్‌పై రోహిత్ చేసిన ఎనిమిదో యాభై లేదా అంతకంటే ఎక్కువ స్కోరు.  ఈ ఇన్నింగ్స్ తో ఎంఎస్ ధోని రికార్డును అధిగమించాడు. భారత మాజీ కెప్టెన్ ధోని న్యూజిలాండ్‌పై 7 సార్లు 50 లేదా అంత‌కంటే ఎక్కువ స్కోర్లు సాధించాడు.

66
Image Credit: Getty Images

Image Credit: Getty Images

రోహిత్ దూకుడు స్ట్రోక్ ప్లే, శుభ్‌మాన్ గిల్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేయడంతో భార‌త్ కు మంచి ఆరంభం ల‌భించింది. ఒక్క వికెట్ కూడా న‌ష్ట‌పోకుండా భార‌త జ‌ట్టు 100 ప‌రుగులు పూర్తి చేసింది. అయితే, ఆ త‌ర్వాత కీల‌క‌మైన మూడు వికెట్లు కోల్పోయింది. గిల్ 31 ప‌రుగులు చేసి సాంట్న‌ర్ బౌలింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. విరాట్ కోహ్లీ రెండో బంతికే ఒక ప‌రుగులు చేసి బ్రేస్ వెల్ బౌలింగ్ లో ఎల్బీడ‌బ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత రోహిత్ శ‌ర్మ 76 ప‌రుగుల వ‌ద్ద భారీ షాట్ ఆడ‌బోయే వికెట్ల ముందు దొరికిపోయాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఎం.ఎస్. ధోని
రోహిత్ శర్మ
క్రీడలు
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ఉర్విల్‌ పటేల్‌ సునామీ ఇన్నింగ్స్ తో లక్నో ను దెబ్బకొట్టిన చెన్నై
Recommended image2
Vaibhav Sooryavanshi : సచిన్, కోహ్లీ వల్ల కాలేదు.. 15 ఏళ్ల కుర్రాడు వరల్డ్ రికార్డ్ కొట్టాడు!
Recommended image3
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్ వరల్డ్ కప్ సమరానికి డేట్ ఫిక్స్.. దాయాదుల ఫైట్ మామూలుగా ఉండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved