హంగ్‌కాంగ్‌తో అంత ఈజీ కాదు... ఆసియా కప్ 2018లో టీమిండియాకి ముచ్ఛెమటలు పట్టించి...
ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా టీమిండియా, తన తర్వాతి మ్యాచ్‌లో హంగ్‌కాంగ్‌తో తలబడనుంది. ఆసియా కప్ 2022 క్వాలిఫైయర్స్‌లో ఆతిథ్య యూఏఈని ఓడించి, గ్రూప్ స్టేజీకి అర్హత సాధించింది హంగ్‌కాంగ్. హంగ్‌కాంగ్‌తో టీమిండియా ఇప్పటివరకూ రెండు వన్డేలు మాత్రమే ఆడింది. రెండు వన్డేల్లోనూ భారత జట్టుదే విజయం...
2008 ఆసియా కప్ (వన్డే ఫార్మాట్) లోహంగ్‌కాంగ్‌తో మొదటిసారి తలబడింది భారత జట్టు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా.. గౌతమ్ గంభీర్ 54 బంతుల్లో 7 ఫోర్లతో 51, వీరేంద్ర సెహ్వాగ్ 44 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగులు చేసి అవుట్ అయ్యారు...
29 బంతుల్లో 11 పరుగులు చేసిన నేటి సారథి రోహిత్ శర్మ రనౌట్ కాగా సురేష్ రైనా 68 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు, ఎంఎస్ ధోనీ 96 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 109 పరుగులు చేశారు...
hong kong
ఈ లక్ష్య ఛేదనలో 118 పరుగులకి ఆలౌట్ అయ్యి, 256 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది హంగ్ కాంగ్. పియూష్ చావ్లా 4 వికెట్లు తీయగా వీరేంద్ర సెహ్వాగ్ 2 వికెట్లు తీశాడు. యూసఫ్ పఠాన్, ఆర్పీ సింగ్‌లకు చెరో వికెట్ దక్కాయి. ఈ మ్యాచ్ తర్వాత మరో 10 ఏళ్ల వరకూ భారత్, హంగ్ కాంగ్ మధ్య మ్యాచ్ జరగలేదు...
Image credit: Getty
2018 ఆసియా కప్ టోర్నీలో గ్రూప్ స్టేజీకి అర్హత సాధించింది హంగ్ కాంగ్. అయితే ఈసారి టీమిండియాకి అనుకున్నంత ఈజీగా గెలుపు దక్కలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది...
Image credit: Getty
కెప్టెన్ రోహిత్ శర్మ 23 పరుగులు చేయగా శిఖర్ ధావన్ 120 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు..
అంబటి రాయుడు 60, దినేశ్ కార్తీక్ 33, కేదార్ జాదవ్ 28 పరుగులు చేయగా ఎంఎస్ ధోనీ డకౌట్ అయ్యాడు. అయితే 286 పరుగుల లక్ష్యఛేదనలో హంగ్ కాంగ్ ఓపెనర్లు అద్భుతంగా పోరాడారు... నిజకత్ ఖాన్ 92, అన్సీ రత్ 73 పరుగులు చేసి తొలి వికెట్‌కి 174 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...
Hong Kong bat
ఎంత మంది బౌలర్లను మార్చినా టీమిండియాకి 35వ ఓవర్ వరకూ వికెట్ దక్కలేదు. టీమిండియాపై హంగ్ కాంగ్ భారీ విజయం సాధించడం ఖాయమనుకున్నారంతా. అయితే 34.1 ఓవర్లకు 174 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన హంగ్‌కాంగ్, 50 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 259 పరుగులకి పరిమితమైంది. ఖలీల్ అహ్మద్, యజ్వేంద్ర చాహాల్ మూడేసి వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు...
Hong Kong vs India
ఈ మ్యాచ్‌లో ఓడినా హంగ్ కాంగ్ చూపించిన పోరాటం అద్భుతం. ఆఖర్లో అనుభవం ఉన్న ఒకే ఒక్క హిట్టర్ ఉండి ఉంటే టీమిండియాకి షాక్ తగిలేది. కాబట్టి హంగ్ కాంగ్‌ని తక్కువ అంచనా వేయొద్దని భారత జట్టును హెచ్చరిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...