- Home
- Sports
- Cricket
- ఆ క్రెడిట్ నాకే దక్కాలి, అతనికి ఆ టిప్స్ చెప్పింది నేనే... జస్ప్రిత్ బుమ్రా సతీమణి సంజన గణేశన్...
ఆ క్రెడిట్ నాకే దక్కాలి, అతనికి ఆ టిప్స్ చెప్పింది నేనే... జస్ప్రిత్ బుమ్రా సతీమణి సంజన గణేశన్...
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టుకి అనుకోకుండా కెప్టెన్సీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత అటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనే కాకుండా బ్యాటుతోనూ మెరుపులు మెరిపించి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు బుమ్రా...

Image credit: Getty
తొలి ఇన్నింగ్స్‌లో 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన జస్ప్రిత్ బుమ్రా, స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఇన్నింగ్స్ 84 వ ఓవర్‌లో 35 పరుగులు రాబట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు...టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బ్రియాన్ లారా రికార్డును చెరిపి వేశాడు బుమ్రా...
Virat KOhli, , Jasprit Bumrah, India vs England, INDvsENG 5th Test, Team India
బౌలింగ్‌లో దుమ్మురేపే పర్పామెన్స్ ఇచ్చినప్పటికీ జస్ప్రిత్ బుమ్రా... చాలా ఏళ్ల పాటు బ్యాటు సరిగ్గా పట్టుకోవడానికే కష్టపడుతున్నట్టుగా కనిపించేవాడు. అయితే ఇంగ్లాండ్ టూర్ 2021లో జస్ప్రిత్ బుమ్రా బ్యాటింగ్‌లో మార్పు కనిపించింది...
లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో జేమ్స్ అండర్సన్‌ని బౌన్సర్లతో ముప్పుతిప్పలు పెట్టాడు జస్ప్రిత్ బుమ్రా. జిమ్మీని టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేసిన బుమ్రాని, రెండో ఇన్నింగ్స్‌లో రివర్స్ అటాక్ చేసింది ఇంగ్లాండ్ టీమ్. ఈ సమయంలో మహ్మద్ షమీతో కలిసి 89 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు జస్ప్రిత్ బుమ్రా...
Mohammed Shami and Jasprit Bumrah
ఈ టెస్టులో భారత జట్టు, ఇంగ్లాండ్‌ని నాలుగో ఇన్నింగ్స్‌లో 51.2 ఓవర్లలో 120 పరుగులకి ఆలౌట్ చేసి 151 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది భారత జట్టు. అదే ఇంగ్లాండ్‌పై, అదే సిరీస్‌లో మిగిలిన ఐదో టెస్టుకి కెప్టెన్సీ చేసే అవకాశం దక్కించుకున్న బుమ్రా, 550 వికెట్లు తీసిన అనుభవం ఉన్న స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఈజీగా బౌండరీలు బాదడం హాట్ టాపిక్ అయ్యింది...
Jasprit Bumrah
‘టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రా ఎంపికైన విషయం తెలియగానే ఆయన అమ్మగారు ఎంతో సంతోషించారు. ఆమె ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు, కానీ చిన్నతనం నుంచి బుమ్రాని చూస్తూ, అతని ఆటను చూస్తూ వచ్చింది. అందుకే ఎన్నో సలహాలు, టిప్స్ ఇచ్చింది...
Image Credit: Jasprit Bumrah Instagram
నేను మాత్రం అతనికి ఏ టిప్స్ ఇవ్వలేదు. అయితే అతని బ్యాటింగ్ విషయంలో మాత్రం టిప్స్ ఇచ్చాను... బ్యాటింగ్ క్రెడిట్ మాత్రం నాకే దక్కాలి... ’ అంటూ నవ్వేసింది జస్ప్రిత్ బుమ్రా సతీమణి సంజన గణేశన్...
జస్ప్రిత్ బుమ్రాకి పెద్దగా బ్యాటింగ్ రాదు, కాబట్టి అతనికి నేను నేర్పిందేమీ లేదనే ఉద్దేశంతో సంజన గణేశన్, శ్రీలంక మాజీ క్రికెటర్, ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్థనేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా కామెంట్ చేసింది. ఐదో టెస్టుకి ముందటి ఈ వీడియో, బుమ్రా బ్యాటింగ్ మెరుపుల తర్వాత వైరల్ అవుతోంది...
Image Credit: Sanjana Ganesan Instagram
స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్‌ని ప్రేమించిన జస్ప్రిత్ బుమ్రా, 2021లో స్వదేశంలో ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుక పూర్తయి, ఫోటోలు బయటికి వచ్చే వరకూ జస్ప్రిత్ బుమ్రా పెళ్లి చేసుకున్నది ఎవరని? అనే విషయంపై సస్పెన్స్ కొనసాగింది.