నో టికెట్స్... రెండో టెస్టు టికెట్ల కోసం ప్రేక్షకుల భారీ క్యూ... అండర్సన్ దూరం, బరిలో స్టువర్ట్ బ్రాడ్...

First Published Feb 11, 2021, 4:18 PM IST

ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో మొదటి టెస్టు ఆడిన భారత జట్టు, రెండో టెస్టులో 50 శాతం ప్రేక్షకుల మధ్య మ్యాచ్ ఆడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనున్న రెండో టెస్టుకి మొత్తం కెపాసిటీలో 50 శాతం అంటే 15 వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్. రెండు రోజుల నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విక్రయిస్తున్న ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.