పూణెలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్... మూడు మ్యాచులకు ప్రేక్షకులకు నో ఎంట్రీ...
చెన్నైలో మొదటి రెండు టెస్టు మ్యాచులు ఆడిన ఇండియా, ఇంగ్లాండ్ జట్లు, ప్రస్తుతం అహ్మదాబాద్‌లో మిగిలిన రెండు టెస్టులను ఆడుతోంది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఇక్కడే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కూడా జరగనుంది. రెండో టెస్టుకి, మూడో టెస్టుకి ప్రేక్షకులను అనుమతించిన బీసీసీఐ, వన్డే సిరీస్‌ను మాత్రం ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని భావిస్తోంది...
షెడ్యూల్ ప్రకారం మార్చి 23 నుంచి మహారాష్ట్రలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మార్చి 26న రెండో వన్డే, మార్చి 28న మూడో వన్డే జరుగుతాయి. వన్డే సిరీస్‌తో ఇండియా టూర్ ముగించుకుంటుంది ఇంగ్లాండ్ జట్టు...
ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కారణంగానే ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లను కూడా ముంబైలో నిర్వహించాలా? వద్దా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. మహారాష్ట్రలో మ్యాచులు పెట్టకపోవడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి...
‘మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ తాక్రే సూచనలతో ప్రేక్షకులు లేకుండా వన్డే సిరీస్ నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నాం... ’ అంటూ తెలిపాడు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ కకట్కర్...
వన్డే సిరీస్‌కే ప్రేక్షకులు లేకుండా మూసిన తలుపుల మధ్య మ్యాచులు నిర్వహించాలని సూచించిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఐపీఎల్ 2021 మ్యాచులకు కూడా ప్రేక్షకులు లేకుండా నిర్వహించడానికి అనుమతినిచ్చింది.
దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కి హోం గ్రౌండ్ అయిన ముంబైలో ప్రేక్షకులు ఉండరు. అహ్మదాబాద్‌తో పాటు చెన్నై, కోల్‌కత్తా, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులు జరగనున్నాయి.