వాళ్లిప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నారు, అయినా... టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...
ఈ మధ్యకాలంలో సుదీర్ఘమైన టెస్టు సిరీస్‌ని ఇంగ్లాండ్ టూర్‌లో ముగించబోతోంది భారత జట్టు. గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైన ఐదు టెస్టుల సిరీస్, కరోనా పుణ్యమాని ఏడాది తర్వాత పూర్తి కానుంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఇరుజట్లలో చాలా మార్పులు జరగడం విశేషం...

ఇంగ్లాండ్ టూర్ 2021లో భారత జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఉంటే, హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి వ్యవహరించాడు. ఇంగ్లాండ్ టీమ్ కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్ వ్యవహరిస్తే, టెస్టు కెప్టెన్‌గా జో రూట్ ఉన్నాడు...
అయితే ఏడాదిలో ఇరు జట్లలోనూ అనేక మార్పులు జరిగాయి. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత హెడ్ కోచ్ బాధ్యతల నుంచి రవిశాస్త్రి తప్పుకున్నాడు. ఆ తర్వాత కొన్నిరోజులకే మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు విరాట్ కోహ్లీ...
వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో తీవ్ర మనస్థాపం చెందిన విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా టూర్‌లో కేప్ టౌన్ టెస్టు తర్వాత టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేశాడు...
Joe Root
మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు 4-0 తేడాతో చిత్తుగా ఓడింది. సిడ్నీలో డ్రాగా ముగిసిన మ్యాచ్‌లోనూ 9 వికెట్లు కోల్పోయి, ఆఖరి వికెట్‌కి చివరి అరగంట కాపాడుకుని లక్కీగా ఓటమి నుంచి తప్పించుకుంది...
Joe Root
యాషెస్ సిరీస్ ఘోర పరాభవం తర్వాత హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌ని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఆ తర్వాత వెస్టిండీస్ టూర్‌లో సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ స్వచ్ఛందంగా ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు...
Ben Stokes
ఇంగ్లాండ్ టెస్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ బాధ్యతలు తీసుకోగా, టెస్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ నియమించబడ్డాడు. వీళ్లిద్దరి హయాంలో న్యూజిలాండ్‌ని చిత్తు చేసి, టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది ఇంగ్లాండ్...
Image credit: PTI
‘ఇంగ్లాండ్‌లో టెస్టు మ్యాచ్ ఆడడం ఎప్పుడూ భలే మజాగా ఉంటుంది. ఈ మ్యాచ్ విజయం మాకు చాలా అవసరం. డబ్యూటీసీ పాయింట్లే కాకుండా సిరీస్ విజయం కూడా. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ మునుపటి కంటే మెరుగ్గా ఆడుతోంది...
Rahul Dravid
ఇప్పుడు వాళ్లున్న ఫామ్‌ని బట్టి చూస్తే ఐదో టెస్టు హోరాహోరీగా సాగుతుంది. గత ఏడాది వాళ్లు ఓ అడుగు వెనకున్నారు. ఇప్పడు మాత్రం వాళ్ల పర్ఫామెన్స్ ఛాలెంజింగ్‌గానే ఉంది...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...
Ben Stokes
జో రూట్ కెప్టెన్సీలో డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో 11 టెస్టు మ్యాచులాడి ఒకే ఒక్క టెస్టు గెలిచింది ఇంగ్లాండ్. ఇది కూడా లీడ్స్‌లో టీమిండియాపై గెలిచిందే. అయితే బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో వరుసగా రెండు టెస్టులు గెలిచి, ఆఖరి పొజిషన్ నుంచి పైకి వచ్చింది ఇంగ్లాండ్..